పానీ పూరీ | Pani Puri Recipe in Telugu

ద్వారా BetterButter Editorial  |  28th Aug 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Pani Puri by BetterButter Editorial at BetterButter
పానీ పూరీby BetterButter Editorial
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1784

0

పానీ పూరీ వంటకం

పానీ పూరీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pani Puri Recipe in Telugu )

 • వేయించడానికి నూనె
 • ఉప్పు రుచికి సరిపడినంత
 • 45 గ్రాములు పిండి (మైదా)
 • 1/4 చెంచా బేకింగ్ సోడా
 • బొంబాయి రవ్వ 200 గ్రాములు (రవ్వ /సుజీ)
 • పూరీ పదార్థాలు:
 • నల్ల ఉప్పు తగినంత
 • 2 నుండి 3 కప్పుల నీళ్ళు
 • 2 పెద్ద చెంచాలు శనగపిండి ఉండలు (బూందీ)
 • 1/2 సన్నగా తరిగిన పుదీనా ఆకులు
 • 1/2 కప్పు తరిగిన కొత్తిమీర
 • 3 పెద్ద చెంచాలు బెల్లం(విడదీసింది లేదా పొడి)
 • 1 పెద్ద చెంచా చింతపండు ముద్ద
 • 1 మరయు 1/2 చెంచా జీలకర్ర పొడి(వేయించింది)
 • 1 మరియు 1/2 చెంచా చాట్ మసాలా పొడి
 • 1 అంగుళం అల్లం సన్నగా తరిగింది
 • 1 పచ్చి మిరపకాయ సన్నగా తరిగింది
 • పానీ పదార్థాలు:
 • నల్ల ఉప్పు అవసరమైనంత
 • సన్నగా తరిగిన చేతినిండా కొత్తిమీర
 • 1/4 చెంచా ఎర్ర కారం పొడి
 • 1/2 చెంచా జీలకర్ర పొడి(వేయించింది)
 • 1/2 చెంచా చాట్ మసాలా పొడి
 • 1 మధ్యస్థ పరిమాణ ఉల్లిపాయ
 • 3 మధ్యస్థ పరిమాణ బంగాలదుంపలు
 • స్టప్ఫింగ్ కొరకు పదార్థాలు:

పానీ పూరీ | How to make Pani Puri Recipe in Telugu

 1. పూరీల కోసం:
 2. ఒక గిన్నె తీసుకుని దానిలో బొంబాయి రవ్వ, పిండి, బేకింగ్ సోడా మరియు ఉప్పు వేయండి. గట్టి పిండి కలపడానికి కొంచెం వేడి నీరు పోయండి.
 3. తడి మస్లిన్ వస్త్రంతో మూసి 30 నిమిషాల వరకు ప్రక్కకు పెట్టండి.
 4. చిన్ననిమ్మకాయ పరిమాణంలో ఉండాలని పిండిటో చెయ్యండి.
 5. కొంచెం పిండివేసిన ఉపరితం మీద, మందపాటి రోటీలని వత్తి కుకీ కట్టర్/డబ్బా మూతతో చిన్న గుండ్రని ఆకారాలని కత్తిరించండి.
 6. మందాపాటి అడుగు ఉన్న ప్యాన్/కడాయి తీసుకుని మరియు బాగా వేయించడానికి సరిపాడా నూనెని వేడి చేయండి.
 7. వేడయిన తర్వాత, ఒకే సమయంలో 3-4 పూరీలు వేసి చిన్న బ్యాచులలో వాటిని వేయించండి.
 8. వేయించేటప్పుడు పురీలని మధ్యలో ఒత్తండి అందువల్ల అవి బాగా ఉబ్బుతాయి.
 9. పురీలని తిప్పండి మరియు అవి కరకరలాడుతూ, కొంచెం గోధుమ రంగులోకి వచ్చేవరకు వండండి.
 10. అధిక మొత్తంలో ఉన్న నూనెని పీల్చడానికి కాగితం టవలులోకి తీయండి.
 11. తినడానికి ముందు వాటిని బాగా చల్లారనివ్వండి. వాటిని మీరు గాలిచొరని డబ్బాల్లో నిల్వ చేసి అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు.
 12. స్టప్ఫింగ్ కొరకు:
 13. వండేలోపు బంగాళదుంపలని కడిగి ఉడికించండి.
 14. ఒకసారి ఉడికినప్పుడు, బంగాలదుంపలని తొక్కతీయండి అప్పుడు చిన్న ముక్కలుగా కోయండి. ఉల్లిపాయల్ని సన్నగా తరగండి.
 15. చిన్న గిన్నె తీసుకుని, ఉల్లిపాయ, బంగాళదుంపలు, కొత్తిమీర, చాట్ మసాలా పొడి, జీలకర్ర, మరియు నల్ల ఉప్పు ని వేయండి.
 16. మిశ్రమాన్ని బాగా కలిపి ప్రక్కకు పెట్టండి.
 17. పానీని తయారు చేయడం:
 18. పచ్చడి రూపం కోసం మొత్తం పానీ పదార్థాలను కలిపి కొంచెం నీరు పోసి రుబ్బండి.
 19. ఒకసారి ఇది చివరగా రుబ్బాక, ఈ పానీ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి పోయండి. దానిలో 2-3 కప్పుల నీటిని పోసి బాగా కలపండి.
 20. ఈ మిశ్రమం యొక్క మసాలాని పరిశీలించండి, మీ రుచి ప్రకారం మీరు మరింత ఉప్పు లేదా దినుసులు కలుపుకోవచ్చు.
 21. చివరగా ఈ పానీ మిశ్రమానికి బుందీని జోడించండి.
 22. వడ్డించడానికి ముందు ఈ మిశ్రమాన్ని రెఫ్రిజరేటర్ లో పెట్టండి లేదా ఐస్ ముక్కలని కలపండి.

Reviews for Pani Puri Recipe in Telugu (0)