హోమ్ / వంటకాలు / పానీ పూరీ

Photo of Pani Puri by BetterButter Editorial at BetterButter
8283
302
4.7(0)
1

పానీ పూరీ

Aug-28-2015
BetterButter Editorial
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పానీ పూరీ రెసిపీ గురించి

మనకు గోల్గప్పా, ఫుల్కీ మరియు పుచ్కాగా తెలుసు, "పానీ పూరీ" రుచికరమైన ఫిల్లింగ్ తో మరియు తీపి/పులుపు డిప్ తో ఒక అద్బుతమైన వీధి ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • యుపి
  • మిళితం
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. స్టప్ఫింగ్ కొరకు పదార్థాలు:
  2. 3 మధ్యస్థ పరిమాణ బంగాలదుంపలు
  3. 1 మధ్యస్థ పరిమాణ ఉల్లిపాయ
  4. 1/2 చెంచా చాట్ మసాలా పొడి
  5. 1/2 చెంచా జీలకర్ర పొడి(వేయించింది)
  6. 1/4 చెంచా ఎర్ర కారం పొడి
  7. సన్నగా తరిగిన చేతినిండా కొత్తిమీర
  8. నల్ల ఉప్పు అవసరమైనంత
  9. పానీ పదార్థాలు:
  10. 1 పచ్చి మిరపకాయ సన్నగా తరిగింది
  11. 1 అంగుళం అల్లం సన్నగా తరిగింది
  12. 1 మరియు 1/2 చెంచా చాట్ మసాలా పొడి
  13. 1 మరయు 1/2 చెంచా జీలకర్ర పొడి(వేయించింది)
  14. 1 పెద్ద చెంచా చింతపండు ముద్ద
  15. 3 పెద్ద చెంచాలు బెల్లం(విడదీసింది లేదా పొడి)
  16. 1/2 కప్పు తరిగిన కొత్తిమీర
  17. 1/2 సన్నగా తరిగిన పుదీనా ఆకులు
  18. 2 పెద్ద చెంచాలు శనగపిండి ఉండలు (బూందీ)
  19. 2 నుండి 3 కప్పుల నీళ్ళు
  20. నల్ల ఉప్పు తగినంత
  21. పూరీ పదార్థాలు:
  22. బొంబాయి రవ్వ 200 గ్రాములు (రవ్వ /సుజీ)
  23. 1/4 చెంచా బేకింగ్ సోడా
  24. 45 గ్రాములు పిండి (మైదా)
  25. ఉప్పు రుచికి సరిపడినంత
  26. వేయించడానికి నూనె

సూచనలు

  1. పూరీల కోసం:
  2. ఒక గిన్నె తీసుకుని దానిలో బొంబాయి రవ్వ, పిండి, బేకింగ్ సోడా మరియు ఉప్పు వేయండి. గట్టి పిండి కలపడానికి కొంచెం వేడి నీరు పోయండి.
  3. తడి మస్లిన్ వస్త్రంతో మూసి 30 నిమిషాల వరకు ప్రక్కకు పెట్టండి.
  4. చిన్ననిమ్మకాయ పరిమాణంలో ఉండాలని పిండిటో చెయ్యండి.
  5. కొంచెం పిండివేసిన ఉపరితం మీద, మందపాటి రోటీలని వత్తి కుకీ కట్టర్/డబ్బా మూతతో చిన్న గుండ్రని ఆకారాలని కత్తిరించండి.
  6. మందాపాటి అడుగు ఉన్న ప్యాన్/కడాయి తీసుకుని మరియు బాగా వేయించడానికి సరిపాడా నూనెని వేడి చేయండి.
  7. వేడయిన తర్వాత, ఒకే సమయంలో 3-4 పూరీలు వేసి చిన్న బ్యాచులలో వాటిని వేయించండి.
  8. వేయించేటప్పుడు పురీలని మధ్యలో ఒత్తండి అందువల్ల అవి బాగా ఉబ్బుతాయి.
  9. పురీలని తిప్పండి మరియు అవి కరకరలాడుతూ, కొంచెం గోధుమ రంగులోకి వచ్చేవరకు వండండి.
  10. అధిక మొత్తంలో ఉన్న నూనెని పీల్చడానికి కాగితం టవలులోకి తీయండి.
  11. తినడానికి ముందు వాటిని బాగా చల్లారనివ్వండి. వాటిని మీరు గాలిచొరని డబ్బాల్లో నిల్వ చేసి అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు.
  12. స్టప్ఫింగ్ కొరకు:
  13. వండేలోపు బంగాళదుంపలని కడిగి ఉడికించండి.
  14. ఒకసారి ఉడికినప్పుడు, బంగాలదుంపలని తొక్కతీయండి అప్పుడు చిన్న ముక్కలుగా కోయండి. ఉల్లిపాయల్ని సన్నగా తరగండి.
  15. చిన్న గిన్నె తీసుకుని, ఉల్లిపాయ, బంగాళదుంపలు, కొత్తిమీర, చాట్ మసాలా పొడి, జీలకర్ర, మరియు నల్ల ఉప్పు ని వేయండి.
  16. మిశ్రమాన్ని బాగా కలిపి ప్రక్కకు పెట్టండి.
  17. పానీని తయారు చేయడం:
  18. పచ్చడి రూపం కోసం మొత్తం పానీ పదార్థాలను కలిపి కొంచెం నీరు పోసి రుబ్బండి.
  19. ఒకసారి ఇది చివరగా రుబ్బాక, ఈ పానీ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి పోయండి. దానిలో 2-3 కప్పుల నీటిని పోసి బాగా కలపండి.
  20. ఈ మిశ్రమం యొక్క మసాలాని పరిశీలించండి, మీ రుచి ప్రకారం మీరు మరింత ఉప్పు లేదా దినుసులు కలుపుకోవచ్చు.
  21. చివరగా ఈ పానీ మిశ్రమానికి బుందీని జోడించండి.
  22. వడ్డించడానికి ముందు ఈ మిశ్రమాన్ని రెఫ్రిజరేటర్ లో పెట్టండి లేదా ఐస్ ముక్కలని కలపండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర