మసాలా మిర్చి | Masala mirchi Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  13th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Masala mirchi by Kavitha Perumareddy at BetterButter
మసాలా మిర్చిby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

19

0

మసాలా మిర్చి వంటకం

మసాలా మిర్చి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala mirchi Recipe in Telugu )

 • పచ్చిమిర్చి పావుకేజీ
 • ఉప్పు తగినంత
 • జీలకర్ర స్పున్
 • పసుపుకొద్దిగా
 • ధనియపొడి స్పున్
 • జీలకర్ర పొడి స్పున్
 • ఆమ్ చూర్ పొడి స్పున్
 • చాట్ మసాలా సగం స్పున్
 • నువ్వులపొడి 3 స్పూన్స్
 • నూనె 2 స్పూన్స్

మసాలా మిర్చి | How to make Masala mirchi Recipe in Telugu

 1. ముందుగా పచ్చిమిర్చి కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి.తొడిమేలు తీయకూడదు .
 2. తరువాత పచ్చిమిర్చి ని నిలువుగా కత్తితో గాటు పెట్టుకోవాలి.
 3. ఇప్పుడు పోయిమీద బాండిపెట్టి నూనె వేసి జీలకర్ర, పసుపుకొద్దిగా వేసుకోవాలి .తరువాత పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి కలిపి 5 నిముషాలు వేగనివ్వాలి.
 4. తరువాత ధనియపొడి, జీలకర్రపొడి, ఆమ్ చూర్ పొడి,చాట్ మసాలా,వేసి కలపాలి.5 నిముషాలు ఉంచాలి.
 5. చివరగా నువ్వులపొడి వేసి కలుపుకోవాలి..
 6. 5 నిముషాలు ఉంటే సరిపోతుంది.

నా చిట్కా:

పులుపు ఇష్టం ఐతే ఒక స్పూన్ నిమ్మరసం వేసి చివరగా కలుపుకోవచ్చు.

Reviews for Masala mirchi Recipe in Telugu (0)