Photo of Mint chakli by Anitha Rani at BetterButter
733
12
0.0(3)
0

Mint chakli

Dec-14-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యపు పిండి 1కప్
  2. మినపప్పు పిండి 4స్పూన్స్
  3. పుదీన...1 కట్ట
  4. వెన్న 4టేబుల్ స్పూన్స్
  5. జీలకర్ర పొడి 1/4స్పూన్
  6. ఉప్పు సరిపడా
  7. ఎండు మిరప పొడి 1/2స్పూన్
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  9. నెయ్యి..1స్పూన్

సూచనలు

  1. మినపప్పు ను దోరగా వేయించి పొడి చేసుకోవాలి.
  2. బియ్యపుపిండి, మినపప్పుపొడి రెండు కలుపుకోవాలి.
  3. పుదీన ఆకులు నీటితో కడగాలి.
  4. పుదీన మిక్సీలో వేసేటప్పుడు కొద్దిగా నీరు వేసి మెత్తగా గుజ్జు లాగా చేసుకోవాలి.
  5. గుజ్జును వడబెట్టు కోవాలి.
  6. ఎక్కువ పలుచ గా చేసుకోకూడదు.
  7. అందులో వెన్న,ఉప్పు,జీలకర్ర, కారము,వేసి చేతి తో ఉండలు లేకుండా బాగా కలపాలి.
  8. పుదీనా గుజ్జు కూడా వేసి కలపాలి.
  9. అవసరమైన నీరు పోసి చపాతీ పిండి లాగా కలిపి ముద్దగా చేసి నెయ్యి వేసి కలిపి 10ని నాన నివ్వాలి.
  10. పిండి ని రెండు చేతులతో మర్దన చెయ్యాలి.
  11. తడిపిన పిండి ముద్ద ను చక్కిలాలు చేసే చట్రం లో పెట్టి చక్కిలాలు మాదిరిగా చుట్టాలి.
  12. ప్లాస్టిక్ పేపర్ పైన నూనె పూసి మూడు వరుసలు,నాలుగు వరుసలు చుట్టూ చుట్టు కోవాలి.
  13. నక్షత్ర ఆకారము బిళ్ళ పెట్టుకుని చుట్టలు చుట్టు కోవాలి.
  14. ఇలా చుట్టి నవాటిని నూనెలో వేసి(డీప్ ఫ్రై) వేయించాలి.
  15. నూనె కాగిన తరువాత చిన్న మంట పైన వేపు కోవాలి.రెండు వైపులా వేపు కోవాలి.
  16. అన్ని తీసిన తరువాత మరల మంట పెంచుకోవాలి.
  17. ఇవి వేగటానికి కొద్దిగా సమయము పడుతుంది. ఇలా వేయించిన చక్కిలాలు ఆరిన తరువాత నిలువ చీసుకోవాలి.
  18. కరకర లాడే పుదీన చక్కిలాలు తయారు.

ఇంకా చదవండి (3)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Gadige Maheswari
Dec-15-2018
Gadige Maheswari   Dec-15-2018

:yum: సూపర్

Lakshmi Varun
Dec-15-2018
Lakshmi Varun   Dec-15-2018

Super ga Vunnaie Anitha Garu....

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర