హోమ్ / వంటకాలు / కాకరకాయ చిప్స్

Photo of Bitter gourd  chips by Pravallika Srinivas at BetterButter
850
1
0.0(0)
0

కాకరకాయ చిప్స్

Dec-14-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ చిప్స్ రెసిపీ గురించి

కాకరకాయలు ఎక్కువ వేపుడు,నింపుడు కూర,బెల్లం కూర,చేస్తూ ఉంటాము.మధుమేహం ఉన్న వాళ్ళు కాకరకాయ తినడం వలన అదుపులో ఉంటుంది అలా అని రోజు రొటీన్ గా తినలేరు .ఇలా చేస్తే నంచుకోవడానికి చాలా బాగుంటాయి.ఉట్టిగానే తినేయవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. కాకరకాయలు - 3
  2. ఉప్పు - 1 స్పూను
  3. వెల్లులి కారం - 1 స్పూను
  4. శనగపిండి - 2 స్పూన్లు
  5. బియ్యంపిండి - 2 స్పూన్లు
  6. జీలకర్ర - 1/2 స్పూను
  7. నూనె - తగినంత
  8. నీరు - తగినంత

సూచనలు

  1. ముందుగా కాకరకాయలను కడిగి సన్నగా చక్రాల్లా తరుగు కోవాలి.
  2. ఇప్పుడు అందులో బియ్యం పిండి,శనగ పిండి,ఉప్పు,కారం ,జీరకర్ర వేసి కలుపు కోవాలి.
  3. పైనుండి కొంచెం నీరు చల్లి బాగా పట్టేట్టు కలుపుకోవాలి.
  4. ఇప్పుడు ఒక బాండీలో నూనె వేసి కాగనిచ్చి విడివిడిగా తగినన్ని చిప్స్ వేసి దోరగా వేయించుకోవాలి.
  5. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి.
  6. అంతే కాకరకాయ చిప్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర