దొండకాయ 65 | Gerkins 65 Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  14th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Gerkins  65 by Pravallika Srinivas at BetterButter
దొండకాయ 65by Pravallika Srinivas
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

దొండకాయ 65 వంటకం

దొండకాయ 65 తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gerkins 65 Recipe in Telugu )

  • దొండకాయలు - పావుకిలో
  • ఉప్పు - 1 స్పూను
  • మసాలా కారం - 1 స్పూను
  • జీలకర్ర - 1 స్పూను
  • పచ్చిమిర్చి చీలికలు - 6 కాయలవి
  • పల్లీలు - గుప్పెడు
  • పోపు దినుసులు - 1 స్పూను
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • నూనె - డీప్ఫ్రై కి
  • బియ్యం పిండి - 1/2 కప్
  • శనగపిండి - 1/2 కప్
  • నీరు - తగినంత

దొండకాయ 65 | How to make Gerkins 65 Recipe in Telugu

  1. ముందుగా దొండకాయలను కడిగి పొడుగ్గా తరిగిపెట్టుకోవాలి.
  2. తరిగిన ముక్కల్లో ఉప్పు,మసాలా కారం,బియ్యంపిండి,శనగపిండి వేసి కలుపుకోవాలి.
  3. కొంచం నీరు చల్లి బాగా కలుపుకోవాలి.
  4. డీప్ఫ్రై కి నూనె పెట్టి దొండకాయను పకోడీలుగా వేసి దోరగా వేయించుకోవాలి.
  5. వేగిన వాటిని నూనె లో నుండి తీసి పక్కన పెట్టుకోవాలి.
  6. పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  7. నూనె మరొక గిన్నెలో తీసి 1 స్పూను నూనె ఉంచి కాగాక పచ్చిమిర్చి చీలికలు,జీలకర్ర,కరివేపాకు వేసి చిటపాటలాడాకా దొండకాయ పకోడీలు వేసుకోవాలి.
  8. కొంచం పసుపు ,చిటికెడు ఉప్పు,వెల్లులి కారం వేసి అన్ని కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి.
  9. స్టవ్ ఆఫ్ చేసి సెర్వింగ్ బౌల్ లో తీసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ 65 రెడీ.
  10. కావాలి అంటే ఎందుకొబ్బరి పొడి కూడా వేసి కలుపుకోవచ్చు.

నా చిట్కా:

దొండకాయను పిండి కలిపేప్పుడు నీరు ఎక్కువ వేయకూడదు.అలా చేయడమ్ వలన త్వరగా వేగిపోతాయి.

Reviews for Gerkins 65 Recipe in Telugu (0)