హోమ్ / వంటకాలు / దొండకాయ 65

Photo of Gerkins  65 by Pravallika Srinivas at BetterButter
600
1
0.0(0)
0

దొండకాయ 65

Dec-14-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ 65 రెసిపీ గురించి

మన తెలుగు రాష్ట్రాల్లో ఏ శుభకార్యమైన బోజన్నాలో ఎక్కువ ఈ వంటకం గమనించవచ్చు.ఇంట్లోనే చాలా తేలికగా చేయవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. దొండకాయలు - పావుకిలో
  2. ఉప్పు - 1 స్పూను
  3. మసాలా కారం - 1 స్పూను
  4. జీలకర్ర - 1 స్పూను
  5. పచ్చిమిర్చి చీలికలు - 6 కాయలవి
  6. పల్లీలు - గుప్పెడు
  7. పోపు దినుసులు - 1 స్పూను
  8. కరివేపాకు - 2 రెమ్మలు
  9. నూనె - డీప్ఫ్రై కి
  10. బియ్యం పిండి - 1/2 కప్
  11. శనగపిండి - 1/2 కప్
  12. నీరు - తగినంత

సూచనలు

  1. ముందుగా దొండకాయలను కడిగి పొడుగ్గా తరిగిపెట్టుకోవాలి.
  2. తరిగిన ముక్కల్లో ఉప్పు,మసాలా కారం,బియ్యంపిండి,శనగపిండి వేసి కలుపుకోవాలి.
  3. కొంచం నీరు చల్లి బాగా కలుపుకోవాలి.
  4. డీప్ఫ్రై కి నూనె పెట్టి దొండకాయను పకోడీలుగా వేసి దోరగా వేయించుకోవాలి.
  5. వేగిన వాటిని నూనె లో నుండి తీసి పక్కన పెట్టుకోవాలి.
  6. పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  7. నూనె మరొక గిన్నెలో తీసి 1 స్పూను నూనె ఉంచి కాగాక పచ్చిమిర్చి చీలికలు,జీలకర్ర,కరివేపాకు వేసి చిటపాటలాడాకా దొండకాయ పకోడీలు వేసుకోవాలి.
  8. కొంచం పసుపు ,చిటికెడు ఉప్పు,వెల్లులి కారం వేసి అన్ని కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి.
  9. స్టవ్ ఆఫ్ చేసి సెర్వింగ్ బౌల్ లో తీసుకుంటే ఎంతో రుచికరమైన దొండకాయ 65 రెడీ.
  10. కావాలి అంటే ఎందుకొబ్బరి పొడి కూడా వేసి కలుపుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర