హోమ్ / వంటకాలు / కూస స్టఫ్ఫ్డ్ ఫ్రై

Photo of MARROW Stuffed fry by Pravallika Srinivas at BetterButter
398
1
0.0(0)
0

కూస స్టఫ్ఫ్డ్ ఫ్రై

Dec-14-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కూస స్టఫ్ఫ్డ్ ఫ్రై రెసిపీ గురించి

ఈ కూస కూరగాయ మిడిల్ ఈస్ట్ కి చెందినది. రుచి కొంచం సొరకాయ నేతి బీరకాయను పోలి ఉంటుంది.చాలా ఆరోగ్యకరం.కొబ్బరితో చేసిన మసాలా కార్యాన్ని కూరి తక్కువ నూనెలో వేయించుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కలయిక
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • దోరగా వేయించటం
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. కూస - 2
  2. మసాలా పొడి కోసం :-
  3. ఉప్పు - 1 స్పూను
  4. కారం - స్పూను
  5. ఎండుకొబ్బరి - అరచిప్ప
  6. ధనియాలు - 2 స్పూన్లు
  7. జీలకర్ర - 1 స్పూను
  8. వెల్లులిరెబ్బలు - 3
  9. వేపుడు కోసం :
  10. నూనె - 2 గరిటలు
  11. పోపుదినుసులు - 1 స్పూను
  12. ఇంగువ .- 1/2 స్పూను
  13. పసుపు - 1/4 స్పూను
  14. కరివేపాకు - 1 రెమ్మ
  15. ఎండుమిర్చి -2
  16. నీరు - ఆవిరికి

సూచనలు

  1. ముందుగా కూసను చిక్కు తీసి తొడిమ కట్ చేసి 2 అంగుళాల ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. మసాలపొడి కూర్చుకోవడం కోసం చీలికలు గా కట్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో మసాలా పొడి కోసం చెప్పిన సామాగ్రి వేసి కొంచెం కోర్సెగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
  4. ముందుగా చీల్చిన కూస ముక్కల్లో ఈ పొడిని స్టఫ్ చేసుకోవాలి.
  5. ఇప్పుడు కడాయి పెట్టి రెండు గరిటల నూనె వేసి కాగాక పోపుదినుసులు, కరివేపాకు,ఇంగువ,పసుపు వేసి చిటపాటలాడాకా స్టఫ్ చేసిన కూస ముక్కలను వేసి పోపు పట్టేట్టుగా కలుపుకోవాలి.
  6. కొంచం అటూఇటూ తిప్పుతూ అన్ని వైపులా కాలేట్టుగా తిప్పుకోవాలి.
  7. ఇప్పుడు పైన నీరు ఉన్న ప్లేట్ పెట్టి ముక్క మెత్తగా అయ్యేవరకు మగ్గించుకోవాలి.
  8. తర్వాత మిగిలిన కూర పొడి వేసి దోరగా వేయించుకోవాలి.
  9. తయారైన కూస స్టఫ్ఫ్డ్ ఫ్రై ని సెర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.
  10. అంతే రుచికరమైన కూస స్టఫ్ఫ్డ్ ఫ్రై రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర