మసాలా వడ | Masala vada Recipe in Telugu

ద్వారా ప్రశాంతి మారం  |  15th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Masala vada by ప్రశాంతి మారం at BetterButter
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

మసాలా వడ వంటకం

మసాలా వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala vada Recipe in Telugu )

  • శనగపప్పు - 2 కప్స్
  • అల్లం - చిన్న ముక్క
  • పచ్చిమిర్చి - 6
  • ఉప్పు - అర స్పూన్
  • వంటసోడా - 2 చిటికెలు
  • కరివేపాకు - 1 రెమ్మ
  • కొత్తిమీర - 1 చిన్న కట్ట
  • మసాలా కారం - పావు స్పూన్
  • నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

మసాలా వడ | How to make Masala vada Recipe in Telugu

  1. ముందుగా శనగపప్పు ను 6 గంటల ముందు నానబెట్టి ఉంచుకోవాలి.
  2. ఇప్పుడు నీళ్లు వంపేసి శనగపప్పు ను ఒక మిక్సీ జార్ లో వేసి అందులో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, వేసి కచ్ఛ పచ్చగా రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, వంటసోడా , కొన్ని పచ్చిసనగపప్పు వేసి పిండి కలిపి పెట్టుకోవాలి.
  4. డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
  5. పిండి ని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ గా వత్తి కాగిన నూనెలో వేసి ఫ్రై చేయాలి.
  6. వీటిని ప్లేట్ లోకి తీసుకొని వీటి పైన మసాలా కారం జల్లి సర్వ్ చేయాలి.
  7. అంతే వేడి వేడి మసాలా వడ తినడానికి రెడీ....

Reviews for Masala vada Recipe in Telugu (0)