హోమ్ / వంటకాలు / తెపాలచక్కలు

Photo of Riceflour thepla by Chandrika Marripudi at BetterButter
423
1
0.0(0)
0

తెపాలచక్కలు

Dec-15-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తెపాలచక్కలు రెసిపీ గురించి

తెపాలచక్కలు బియ్యప్పిండి తో చేసుకునే రొట్టె లాంటి వంటకం. ఉదయం టిఫిన్లా,సాయంత్రం స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇది తెలంగాణా లో సర్వపిండి అని,మరి కొన్ని చోట్ల అక్కిరోటి అంటారు. బియ్యప్పిండి ముఖ్య పదార్దంగా వాడి దాన్లో కలిపే ఇతర పదార్థాలు ప్రాంతాన్ని ,వారి రుచినిబట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఆంధ్రాలో గుంటూరు వైపు చేసుకునే విధంగా చేశాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యప్పిండి : 4 కప్పులు
  2. లేత సొరకాయ : 1(మీడియం సైజుది)
  3. ఉల్లిపాయలు : 4
  4. పచ్చిమిర్చి : 10
  5. అల్లం : 1 అంగుళం ముక్క
  6. కొత్తిమీర తరుగు : 1 కప్
  7. ఉప్పు : తగినంత
  8. జీలకర్ర : 2 స్పూన్లు
  9. నువ్వులు : 4 స్పూన్లు
  10. నూనె : తగినంత

సూచనలు

  1. సొరకాయ చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి.
  2. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,అల్లం సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  3. బియ్యప్పిండి ఒక గిన్నెలో తీసుకుని పై పదార్థాలు పిండిలో వేయాలి.
  4. ఉప్పు, జీలకర్ర, నువ్వులు కొత్తిమీర తరుగు వేసి పిండి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.
  5. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి.
  6. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒకస్పూను నూనె వేయాలి.
  7. పిండి ముద్దని కొద్దిగా పెద్ద ముద్దగా తీసుకుని ఒక కవర్ పైన నూనె రాసుకుని చేత్తో గుండ్రంగా వత్తుకోవాలి.
  8. ఇలా వత్తుకుని వేడయిన బాండీలో వేసి చుట్టూ నూనె వేసి రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి అంతే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర