షాహి తుక్డా | Shahi Tukda Recipe in Telugu

ద్వారా Swathi Dhavala  |  15th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Shahi Tukda by Swathi Dhavala at BetterButter
షాహి తుక్డాby Swathi Dhavala
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    60

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

3

0

షాహి తుక్డా వంటకం

షాహి తుక్డా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Shahi Tukda Recipe in Telugu )

  • బ్రెడ్ 6 ముక్కలు
  • పాలు 11/2 లీటర్ (చిక్కటివి)
  • చక్కెర 100గ్రా + 2 టేబుల్ స్పూన్
  • నెయ్యి 100 గ్రా
  • యాలుకల పొడి కొద్దిగా
  • డ్రై ఫ్రూట్స్ తగినన్ని
  • కుంకుమపువ్వు (ఆప్షనల్)

షాహి తుక్డా | How to make Shahi Tukda Recipe in Telugu

  1. ముందుగా బ్రెడ్ ను అంచులు కత్తిరించి త్రిభుజం ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి.
  2. డ్రై ఫ్రూట్ స్ తరిగి పెట్టుకోవాలి (కుదిరితే పిస్తా నానబెట్టి కట్ చేసుకోవాలి) కొద్దిగా పాలల్లో కుంకుమపువ్వు నానబెట్టాలి.
  3. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి పాత్రలో పాలు తీసుకొని సన్నని సెగ మీద మరిగిస్తూ, అదే సమయంలో ఒక గిన్నెలో చక్కెర తీసుకొని కొద్దిగా నీరు పోసి లేత పాకం వచ్చేలా మరిగించాలి. ఇందులో యాలుకల పొడి కలపాలి.
  4. పాలు పొంగిపోకుండ కలుపుతూ ఉండాలి అవి చాలా దగ్గర పడేంత వరకు.( ఫోటోలో చూపిన విధంగా) ఇలా చిక్కబడిన పాలలో చక్కెర కలపాలి( 2 టేబుల్ స్పూన్ ). కొద్దిగా యాలుకల పొడి కూడా కలపాలి.
  5. పాకం తయారైన తర్వాత పక్కన పెట్టి అదే స్టౌ పై ఒక మూకుట్లో నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేస్కున్న నేతిలో బ్రెడ్ ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.(షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేశాను).
  6. ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలను ముందుగా సిద్ధం చేసుకున్న పాకంలో వేసి పాకం పీల్చుకున్న తర్వాత వేరొక పాత్రలోకి తీసుకోవాలి. వేయించగా మిగిలిన నేతిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పాల మిశ్రమంలో కలపాలి. (పిస్తా ఫ్రై చేయకుండా సర్వ్ చేసేటప్పుడు వేసుకోవాలి).
  7. కుంకుమపువ్వు కూడా పాల మిశ్రమానికి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లో వేయించి పాకంలో నాన బెట్టిన బ్రెడ్ ముక్కలు తీసుకొని దానికి పాల మిశ్రమాన్ని జోడించి దానిపై సన్నగా తరిగిన పిస్తాతో అలంకరించి వేడి వేడిగా తింటుంటే స్వర్గానికి మెట్లే!!!!! దీనిని ఫ్రిజ్ లో కాసేపు పెట్టీ చల్ల చల్లగా తిన్నా చాలా బావుంటుంది.

నా చిట్కా:

పాలు దగ్గరగా మరిగించడం కొంచెం సమయంతో కూడుకున్న పని. అందుకే పాల శాతం తగ్గించి మిల్క్ మెయిడ్ లేదా కోవా కలుపుకోవచ్చు.

Reviews for Shahi Tukda Recipe in Telugu (0)