హోమ్ / వంటకాలు / షాహి తుక్డా

Photo of Shahi Tukda by Swathi Dhavala at BetterButter
622
2
0.0(0)
0

షాహి తుక్డా

Dec-15-2018
Swathi Dhavala
15 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

షాహి తుక్డా రెసిపీ గురించి

హైదరాబాదీ స్పెషల్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఈద్
  • మొఘలాయి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. బ్రెడ్ 6 ముక్కలు
  2. పాలు 11/2 లీటర్ (చిక్కటివి)
  3. చక్కెర 100గ్రా + 2 టేబుల్ స్పూన్
  4. నెయ్యి 100 గ్రా
  5. యాలుకల పొడి కొద్దిగా
  6. డ్రై ఫ్రూట్స్ తగినన్ని
  7. కుంకుమపువ్వు (ఆప్షనల్)

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ ను అంచులు కత్తిరించి త్రిభుజం ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి.
  2. డ్రై ఫ్రూట్ స్ తరిగి పెట్టుకోవాలి (కుదిరితే పిస్తా నానబెట్టి కట్ చేసుకోవాలి) కొద్దిగా పాలల్లో కుంకుమపువ్వు నానబెట్టాలి.
  3. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి పాత్రలో పాలు తీసుకొని సన్నని సెగ మీద మరిగిస్తూ, అదే సమయంలో ఒక గిన్నెలో చక్కెర తీసుకొని కొద్దిగా నీరు పోసి లేత పాకం వచ్చేలా మరిగించాలి. ఇందులో యాలుకల పొడి కలపాలి.
  4. పాలు పొంగిపోకుండ కలుపుతూ ఉండాలి అవి చాలా దగ్గర పడేంత వరకు.( ఫోటోలో చూపిన విధంగా) ఇలా చిక్కబడిన పాలలో చక్కెర కలపాలి( 2 టేబుల్ స్పూన్ ). కొద్దిగా యాలుకల పొడి కూడా కలపాలి.
  5. పాకం తయారైన తర్వాత పక్కన పెట్టి అదే స్టౌ పై ఒక మూకుట్లో నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేస్కున్న నేతిలో బ్రెడ్ ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.(షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేశాను).
  6. ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కలను ముందుగా సిద్ధం చేసుకున్న పాకంలో వేసి పాకం పీల్చుకున్న తర్వాత వేరొక పాత్రలోకి తీసుకోవాలి. వేయించగా మిగిలిన నేతిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పాల మిశ్రమంలో కలపాలి. (పిస్తా ఫ్రై చేయకుండా సర్వ్ చేసేటప్పుడు వేసుకోవాలి).
  7. కుంకుమపువ్వు కూడా పాల మిశ్రమానికి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లో వేయించి పాకంలో నాన బెట్టిన బ్రెడ్ ముక్కలు తీసుకొని దానికి పాల మిశ్రమాన్ని జోడించి దానిపై సన్నగా తరిగిన పిస్తాతో అలంకరించి వేడి వేడిగా తింటుంటే స్వర్గానికి మెట్లే!!!!! దీనిని ఫ్రిజ్ లో కాసేపు పెట్టీ చల్ల చల్లగా తిన్నా చాలా బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర