హోమ్ / వంటకాలు / ఉల్లి చక్రాలు (గుడ్డులేకుండా)

Photo of Onion rings(egg less) by Swapna Tirumamidi at BetterButter
69
5
0.0(0)
0

ఉల్లి చక్రాలు (గుడ్డులేకుండా)

Dec-15-2018
Swapna Tirumamidi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి చక్రాలు (గుడ్డులేకుండా) రెసిపీ గురించి

ఇది ఒక స్నాక్ ఐటమ్.సాయంకాలం టీ తో పాటు తినడానికి చాలా బావుంటాయి.స్టాటర్ ఐటమ్ ల కూడా బావుంటాయి.పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఐటమ్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. గుండ్రటి పెద్ద ఉల్లిపాయలు 2
  2. పెసర పిండి ఒక కప్పు(కొంచం బరక గా ఉన్నది)
  3. వరిపిండి 2 చెంచాలు
  4. పచ్చిమిర్చి ముద్ద అర చెంచా
  5. జీలకర్ర అర చెంచా
  6. బ్రెడ్ పొడి ఒక కప్పు
  7. ఉప్పు సరిపడా.
  8. వంటసోడా అర చెంచా
  9. వేయించడానికి సరిపడా నూని.

సూచనలు

  1. ముందుగా పెసరపిండిని రెడి చేసుకోవాలి(పొట్టులేని పెసర పప్పుని గంట ఎండలో పెట్టి...మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.)
  2. ఇలాచేసుకున్నపిండిని ఒక గిన్నీలోకి తీసుకుని...వరి పిండి ,పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర,ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి బజ్జి పిండిలా కలిపి 10 నిమిషాలు పక్కనపెట్టుకోవాలి.పెసర పిండి నానాక కాస్త గట్టి పడుతుంది...తరువాత మళ్ళీ కాస్తనీళ్లు పోసుకోవాలి.
  3. ఈ లోపు ఉల్లిపాయలు చక్రాలుగా తరిగి ఒక్కొక్కటిగా విడదీసి నీటిలో వేసి పెట్టుకోవాలి.
  4. నూని పొయ్యిమీద పెట్టుకుని వేడి చేసుకోవాలి...
  5. ఒక పళ్లెం లో బ్రెడ్ పొడి వేసి పెట్టుకోవాలి
  6. ఈ లోగా నానపెట్టిన పిండిలో వంటసోడా వేసి ...అవసరం ఐతే కాస్తనీరు పోసి బజ్జి పిండిలా చేసి ...అందులో 5 చప్పున ఉల్లి చక్రాలు వేసి పిండిని బాగా పట్టించాలి
  7. వాటిని బ్రెడ్ పొడిలో వేసి మొత్తం తడిపిండి అంతటా బ్రెడ్ పొడితో కవర్ అయ్యేలా పొడిలో అద్దాలి.
  8. ఇలా బ్రెడ్డుపొడి అద్దిన ఉల్లి రింగులను జాగర్తగా తీసి వేడినూనెలో వేసి ముదురు బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.
  9. అంతే అండి చక్కటి కమ్మటి...కరకర లాడే ఉల్లి చక్రాలు సిద్ధం ...వీటిని టొమాటో కచప్ తో సర్వ్ చేసుకుంటే బావుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర