పన్నీర్ 65. | Panner 65. Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  15th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Panner 65. by Swapna Sashikanth Tirumamidi at BetterButter
పన్నీర్ 65.by Swapna Sashikanth Tirumamidi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

0

పన్నీర్ 65. వంటకం

పన్నీర్ 65. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Panner 65. Recipe in Telugu )

  • పన్నీర్ ముక్కలు 30
  • కార్న్ ఫ్లోర్ 3 స్పూన్స్
  • వరి పిండి 2 స్పూన్స్
  • మైదా 1 స్పూన్
  • కారం 1 స్పూన్
  • గరం మసాలా పొడి అర టీ స్పూన్
  • నూని వేయించడానికి సరిపడా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  • ఉప్పు సరిపడా
  • పసుపు చిటికెడు
  • కరివేపాకు 2 రెమ్మలు...
  • ఆంచూర్ అర టీ స్పూన్.

పన్నీర్ 65. | How to make Panner 65. Recipe in Telugu

  1. కార్నఫ్లోర్,వరిపిండి,మైదా,కారం,ఉప్పు, పసుపు, అన్ని ఒక గిన్నీలో వేసి కొద్దిగా నీళ్లు ...లేదా పాలు పోసి బజ్జి పిండి కన్నా కొద్దిగా జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. పన్నీర్ ముక్కల్లో కాస్త పసుపు ,ఉప్పు,గరం మసాలా,అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్ చూర్ కలిపి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు నూనె వేడిచేసుకోవాలి.అందులో కరివేపాకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  4. పన్నీరు ముక్కల్ని కలుపుకున్న పిండిలో ముంచి వేడి నూనెలో ఎర్రగా వేయించి తీసుకోవాలి
  5. వేయించిన కరివేపాకు తో గార్నిష్ చేసుకుంటే సరి ...పైన కరకరలాడుతూ లోపల మెత్తగా వుండే పన్నీర్ 65 సిద్ధం.

నా చిట్కా:

పన్నీర్ ముక్కలు పిండిలో ముంచి...బ్రెడ్ పొడిలో కూడా అద్ది వెయిస్తే ఇంకా కరకర లాడుతూ ఉంటాయి.

Reviews for Panner 65. Recipe in Telugu (0)