హోమ్ / వంటకాలు / పన్నీర్ 65.

Photo of Panner 65. by Swapna Tirumamidi at BetterButter
467
2
0.0(0)
1

పన్నీర్ 65.

Dec-15-2018
Swapna Tirumamidi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ 65. రెసిపీ గురించి

పన్నీర్ తో చేసిన ఈ వంటకం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు....చాలసులువుకూడా....మంచి ప్రోటీన్ కూడా అందుతుంది.దీన్ని స్టార్టర్ గా,చిరుతిండి స్నాక్స్ లా తీసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఉత్తర భారతీయ
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పన్నీర్ ముక్కలు 30
  2. కార్న్ ఫ్లోర్ 3 స్పూన్స్
  3. వరి పిండి 2 స్పూన్స్
  4. మైదా 1 స్పూన్
  5. కారం 1 స్పూన్
  6. గరం మసాలా పొడి అర టీ స్పూన్
  7. నూని వేయించడానికి సరిపడా
  8. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  9. ఉప్పు సరిపడా
  10. పసుపు చిటికెడు
  11. కరివేపాకు 2 రెమ్మలు...
  12. ఆంచూర్ అర టీ స్పూన్.

సూచనలు

  1. కార్నఫ్లోర్,వరిపిండి,మైదా,కారం,ఉప్పు, పసుపు, అన్ని ఒక గిన్నీలో వేసి కొద్దిగా నీళ్లు ...లేదా పాలు పోసి బజ్జి పిండి కన్నా కొద్దిగా జారుగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. పన్నీర్ ముక్కల్లో కాస్త పసుపు ,ఉప్పు,గరం మసాలా,అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్ చూర్ కలిపి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు నూనె వేడిచేసుకోవాలి.అందులో కరివేపాకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  4. పన్నీరు ముక్కల్ని కలుపుకున్న పిండిలో ముంచి వేడి నూనెలో ఎర్రగా వేయించి తీసుకోవాలి
  5. వేయించిన కరివేపాకు తో గార్నిష్ చేసుకుంటే సరి ...పైన కరకరలాడుతూ లోపల మెత్తగా వుండే పన్నీర్ 65 సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర