హోమ్ / వంటకాలు / బియ్యంపిండి జంతికలు

Photo of Riceflour Chaklis by Pravallika Srinivas at BetterButter
678
4
0.0(0)
0

బియ్యంపిండి జంతికలు

Dec-15-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యంపిండి జంతికలు రెసిపీ గురించి

సాదారణంగా జంతికలు అనగానే మనకు శనగపిండి గుర్తుకు వస్తుంది.బియ్యం పిండితో తేలికగా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యంపిండి - 1/2 కేజీ
  2. పుట్నాల పప్పు పిండి - 1/4 కేజీ
  3. వాము - 2 స్పూన్లు
  4. నువ్వులు - 2 స్పూన్లు
  5. ఉప్పు - 1 స్పూను
  6. కారం - స్పూను
  7. నీరు - తగినంత
  8. నూనె - డీపీఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా పుట్నాలను మిక్సర్ జార్లో వేసి మెత్తగా పొడి కట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక బేసన్ లో బియ్యం పిండి జల్లించి పెట్టి అందులో పుట్నాల పొడి వేసి కలుపుకోవాలి.
  3. ఒక బౌల్ లో ఉప్పు ,కారం,వాము,నువ్వులు వేసి పిండిలో వేసి కలుపుకోవాలి.
  4. అన్ని పొడులు బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి.
  5. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచం పిండి తీసుకుని నీరు పోస్తూ కలపాలి.
  6. చాపాతిపిండి లాగా కలిసే వరకు బాగా మర్దన చేసుకోవాలి.
  7. కొంచం పిండి తీసుకుని జంతికల గొట్టంలో వేసుకోవాలి.మూత గట్టిగా పెట్టి రెడీగా పెట్టుకోవాలి.
  8. ఇప్పుడు కాగిన నూనె లో జంతికలు వత్తుకుని డీపీఫ్రై చేసుకోవాలి.
  9. దోరగా వేగే వరకు వేయించుకోవాలి.
  10. ఇలా బుడగలు తగ్గాక మరొక గిన్నీలో తీసుకోవాలి.
  11. ఇదే విధంగా మొత్తం జంతికలు వతుకోవాలి.
  12. అంతే రుచికరమైన బియ్యంపిండి జంతికలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర