హోమ్ / వంటకాలు / మూంగ్ దాల్ స్వీట్ హార్ట్స్ అండ్ రౌండ్ మూన్స్

Photo of Moong dal sweet hearts and round moons by ప్రశాంతి మారం at BetterButter
650
7
0.0(0)
0

మూంగ్ దాల్ స్వీట్ హార్ట్స్ అండ్ రౌండ్ మూన్స్

Dec-15-2018
ప్రశాంతి మారం
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మూంగ్ దాల్ స్వీట్ హార్ట్స్ అండ్ రౌండ్ మూన్స్ రెసిపీ గురించి

ఇంట్లో నే తయారు చేస్కోదగిన రుచికరమైన ఆరోగ్యకరమైన స్వీట్ ఇది .. మంచి పోషకాలు లభిస్తాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పెసరపప్పు - ఒక కప్పు
  2. సన్న రవ్వ - అర కప్పు
  3. పాలు - 2 1/2 కప్పులు
  4. చక్కెర - ఒక కప్పు
  5. నెయ్యి - 2 స్పూన్స్
  6. ఇలాచీ పొడి - పావు స్పూన్
  7. నూనె - డీప్ ఫ్రై కి సరిపడినంత

సూచనలు

  1. ముందు గా ఒక పాన్ లో మూంగ్ దాల్ వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి.
  2. అదే పాన్ లో 1 1/2 కప్ పాలు, 1 కప్ నీళ్లు పోసి మూంగ్ దాల్ ను ఉడికించాలి.
  3. చల్లగా అయ్యాక మిక్సీ పట్టి పిండి లా చేసుకోవాలి.
  4. ఇప్పుడు ఇంకో పాన్ లో 1 కప్ పాలు పోసి మరిగాక రవ్వ వేసి ఉడికించాలి.
  5. మూంగ్ దాల్ పిండి ఇంకా రవ్వ లను బాగా కలిపి చపాతీ పిండి ల రెడీ చేసుకోవాలి.
  6. ఇప్పుడు చిన్న ఉండ లా తీసుకొని పువ్వు ఆకారం లేదా హార్ట్ షేప్ లో వత్తుకొని మధ్యలో చేతితో వత్తి టూత్ పిక్ తో వత్తుకోవాలి.
  7. ఒక గిన్నెలో చక్కెర నీళ్లు పోసి పాకం రెడీ చేసుకొని ఇలాచిపొడి వేయాలి.
  8. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగిన తరువాత రెడి చేసుకున్న వాటిని మీడియం ఫ్లేమ్ లో వేయించాలి.
  9. తరువాత వీటిని వేడి పాకం లో వేసి బాగా నాననివ్వాలి.
  10. చివరగా ప్లేట్ లోకి తీసి బాదం పప్పు తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
  11. అంతే ఎంతో రుచికరమైన , తీయటి జ్యూసి మూంగ్ దాల్ స్వీట్ హార్ట్స్ రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర