Photo of Nimki (crispy folds) by Swapna Tirumamidi at BetterButter
499
3
0.0(0)
0

నింకి

Dec-15-2018
Swapna Tirumamidi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నింకి రెసిపీ గురించి

నింకి చాలా కరకరలాడుతూ ఉంటుంది....కాళీ సమయంలో కనుక ఇవి చేసి శుభ్రంగా నిల్వ చేసుకుంటే 2 నెలలు పాటు టీ సమయంలో తినడానికి ఏమి తినాలా అని వెతుక్కొక్కరలేదు. చెప్పాపెట్టకుండా వచ్చే అతిధులకి పెట్టడానికి కూడా బావుంటాయి.పెద్ద చిన్న అందరూ ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • ఉత్తర భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 8

  1. మైదా 1 కప్
  2. ఆయిల్ 3 పెద్ద చెంచాలు
  3. కలోంజి /వాము పావు చెంచా
  4. చాట్ మసాలా పొడి పావు చెంచా
  5. ఉప్పు పావు చెంచా
  6. ఆయిల్ వేయించడానికి సరిపడా
  7. ఒక స్పూన్ మైదా,ఒక స్పూన్ నెయ్యి విడిగా పెట్టుకోవాలి.
  8. మిరియం గింజలు కొద్దిగా...

సూచనలు

  1. ముందు కప్పు మైదా లో ఆయిల్,కలోంజి,ఉప్పు వేసి కలిపి నీళ్ళు పోసి పూరి పిండిలా కలిపి 20 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
  2. ఒక చెంచా మైదాలో నెయ్యి కలిపి ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి.
  3. 20 నిమిషాలు అయ్యాక పిండిని బాగా మెదిపి పరాఠా మందం లో పెద్ద పూరి వత్తుకోవాలి.
  4. దానిమీద నెయ్యి పిండి కలిపిన మిశ్రమాన్ని పూరి అంతటా రాసి....చాట్ మసాలా పొడి(ఇక్కడ మీకు కావాలంటే మిరియాల పొడి కూడావేసుకోవచ్చు) చల్లి ఒక పక్కనుంచి టైట్ గా రోల్ చేసుకోవాలి.
  5. ఈ రోల్ ని చిన్న చిన్న ముక్కలుగా అర అంగుళం సైజ్ లో కట్ చేసుకోవాలి.
  6. ఇప్పుడు మూకుడు పెట్టి డీపీఫ్రై కి తగినంత నూని వేసి చిన్న సెగ మీద కాగ నివ్వాలి.
  7. నూనె వేడి అయ్యేలోపు కట్ చేసిన పూరి ముక్కల్ని మళ్ళీ గుండ్రంగా చేసి పూరిలు వత్తుకొని....ఒక్కొక్క పూరీని మధ్యలోకి మడిచి ,మళ్ళీ ఇంకోసారి మధ్యలోకి మడవాలి... అంటే పూరీని రెండు మడతలు గా పెడితే త్రిభుజాకారంలో రావాలి .
  8. ఇలా త్రిభిజాకారంలో మడిచిన నింకి ని టూత్ పిక్ తో అక్కడక్కడ గాట్లు పెట్టి త్రిభుజం మధ్యలో 2మిరియాలు నొక్కి పెట్టుకోవాలి.
  9. ఇలా 5.. 6 నింకి మడతలు తయారయ్యాక మెల్లిగా నూనెలో వేసి సన్న సెగ మీదనే బంగారు వన్నె వచ్చేదాకా సుమారుగా 10...నుంచి 12 నిమిషాలువేగనివ్వాలి...ఒక వాయ వేగేలోపు మరో వాయకి పూరీలు రెడీగా మడిచి పెట్టుకోవాలి.ఇలా అన్నీ చేసుకుని వేయించి పెట్టుకోవాలి...
  10. అంతే కమ్మటి కరకరలాడే నింకీలు రెడీ... వేడిగా వేయించగానే తినాలనుకుంటే కనుక గ్రీన్ చట్నీ లేదా కచెప్ తో బావుంటుంది.టీ తో మరింత బావుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర