హోమ్ / వంటకాలు / ఉప్మా బాల్స్

Photo of Semolina masala balls by Swapna Tirumamidi at BetterButter
480
3
0.0(0)
0

ఉప్మా బాల్స్

Dec-15-2018
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉప్మా బాల్స్ రెసిపీ గురించి

చాలా తేలిక మరియు చాలా రుచి కూడా...ఉప్మా విరోధులకి ఇలా చేసి పెడితే కచ్చితంగా ఒక డజను బాల్స్ తినేస్తారు....పిల్లకి కొత్తగా ఏమిచెయ్యాలి అని ఆలోచించే వారికి ఇదొక మంచి ఐటమ్.టిఫిన్ లా, స్నాక్స్ లా తినవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. రవ్వ 1 కప్పు
  2. పోపు సామాను...శెనగపప్పు, మినపప్పు,ఆవాలు,జీడిపప్పు ..అన్ని ఒక్కొక్క స్పూన్.
  3. కరివేపాకు కొద్దిగా..
  4. ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి రెండేసి.
  5. అల్లం ముక్కలు ఒక స్పూన్.
  6. కార్న్ ఫ్లోర్ అర కప్పు
  7. బ్రెడ్ పొడి అర కప్పు
  8. ఉప్పు ఉప్మాకి సరిపడా.
  9. నూనె...ఉప్మాకి...బాల్స్ వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందు ఉప్మాకి పోపుకి నూనె పెట్టి అందులో ఆవాలు శెనగపప్పు,మినపప్పువేయించి..అల్లం ముక్కలు,పచ్చిమిర్చి..కరివేపాకు,జీడిపప్పులు వేసికమ్మగా వేగాక ఉల్లి ముక్కలు వేసి బాగా వేయించి 2 కప్పుల నీళ్లు పోసి ఉప్పువేసి మరగ నిచ్చి రవ్వ వేసి ఉండలు లేకుండా కలిపి ఉప్మా చేసుకోవాలి.
  2. కాస్త ఉప్మా వేడి తగ్గనిచ్చి బాగా మెదుపుతూ కావలసిన సైజ్ లో ఉండలు చేసి పెట్టుకోవాలి
  3. ఇప్పుడు చిన్న గిన్నీలోకి కార్న్ ఫ్లోర్ తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి.
  4. మూకుడు పెట్టి నూనెవేసి వేడిచెయ్యాలి.
  5. అది కాగే లోపు బ్రెడ్డుపొడిని రెడీగా పెట్టుకోవాలి
  6. ఇప్పుడు ఉప్మా ఉండలని కార్న్ ఫ్లోర్ లో ముంచి...బ్రెడ్ పొడి పట్టించి నూనెలో వేసి అన్ని పక్కలా ... బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి.
  7. అంతే అండి టేస్టీ టేస్టీ ఉప్మా బాల్స్ రెడీ... కచప్ లేదా గ్రీన్ చట్నీ తో సెర్వ్ చేస్తే బావుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర