హోమ్ / వంటకాలు / మలై కోఫ్తా.

Photo of Malai koftha. by దూసి గీత at BetterButter
108
2
0.0(0)
0

మలై కోఫ్తా.

Dec-15-2018
దూసి గీత
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మలై కోఫ్తా. రెసిపీ గురించి

కోఫ్తాలన్నిటిలో భిన్నమైన ప్రత్యేక రుచితో ఉండే సంప్రదాయ ఆహారం.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పిల్లల పుట్టినరోజు
 • భారతీయ
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. కావలసిన పదార్థాలు:
 2. 1- పనీర్ : 1/4 కిలో.
 3. 2- ఫ్రెష్ క్రీం : 1/2 కప్పు.
 4. 3- కార్న్ ఫ్లోర్ : 3 చెంచాలు.
 5. 4- ఉప్పు :1 చెంచా
 6. 5- ఇలాచీ పొడి : చిటికెడు.
 7. 6- జీడిపప్పు : 1/4 కప్పు.
 8. 7- బాదాం : 1/4 కప్పు.
 9. 8- ఉల్లిపాయ : 1
 10. 9- బిర్యానీ ఆకు : 1
 11. 10- బటర్ : 1, చెంచా.
 12. 11 - నూనె డీప్ ఫ్రై కి తగినంత
 13. 12- అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 చెంచా.
 14. 13- సన్నగా కట్ చేసి వేయించిన నట్స్ :1/4 కప్పు.

సూచనలు

 1. తయారుచేసే పద్ధతి : 1- ముందుగా పనీర్ లో ఉప్పు,కార్న్ ఫ్లోర్ చిటికెడు పంచదార వేసి మృదువుగా కలుపుకోవాలి ‌
 2. 2- చెయ్యి తడిచేసుకుని ఈ పనీర్ మిశ్రమం మెత్తని పిండిలా కలపాలి.
 3. 3- ఉల్లిపాయ ముక్కలు ఉడికించాలి
 4. 4- నానపెట్టిన జీడిపప్పు,బాదాం మెత్తని పేస్ట్ చెయ్యాలి
 5. 5- పేన్ లో నూనె వేసి బిర్యాని ఆకు వేసి అది వేగాక ఉడికించిన ఉల్లిపాయ పేస్ట్ వెయ్యాలి
 6. 6- ఉల్లిపాయ పేస్ట్ వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగాక ,జీడిపప్పు బాదాం పేస్ట్ వెయ్యాలి.
 7. 7- ఈ పేస్ట్ కూడా 5 నిమిషాలు వేగాక 2 కప్పులు నీళ్లు పోసి ఉడుకుతుండగా,బటర్,ఫ్రెష్ క్రీం వేసి 6/8 నిమిషాలు కలుపుతూ ఉంచి తర్వాత దించేయాలి.
 8. 8- నట్స్ వేయించి పెట్టుకోవాలి
 9. 9- పనీర్ మిశ్రమాన్ని చిన్న ఉండలు చేసి నట్స్ అందులో స్టఫ్ చెయ్యాలి.
 10. 10 - అన్నీ స్టఫ్ చేసాక ఉండలుగా చేసుకోవాలి
 11. 11- ఈ ఉండల్ని వేడి నూనె లో మీడియం ఫ్లేమ్ లో రంగు మారకుండా(ఎర్రగా అవకుండా) వేయించాలి
 12. 12- ఈ. కోఫ్తాలని బౌల్ లోకి తీసుకుని తయారైన గ్రేవీని పైన వేసి వడ్డించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర