BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / క్యాప్సికం సమోసా (ఫిష్ ఆకారం)

Photo of Capsicum fish braid samosa by Kavitha Perumareddy at BetterButter
0
6
0(0)
0

క్యాప్సికం సమోసా (ఫిష్ ఆకారం)

Dec-15-2018
Kavitha Perumareddy
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాప్సికం సమోసా (ఫిష్ ఆకారం) రెసిపీ గురించి

క్యాప్సికం మూడు రకాలు రెడ్,గ్రీన్,ఎల్లో కలర్స్ ఉపయోగించి చేసాను.ఇలా రకరకాల ఆకరాల్లో చేస్తే పిల్లలు ఇష్టపడతారు. బాగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. రెడ్ క్యాప్సికం 1
  2. ఎల్లో క్యాప్సికం 1
  3. గ్రీన్ క్యాప్సికం 1
  4. బంగాళదుంప 1
  5. ఉల్లిపాయ 1
  6. పచ్చిమిర్చి 3
  7. కారం సగం స్పున్
  8. ఉప్పు తగినంత
  9. పసుపుకొద్దిగా
  10. గరం మసాలా స్పున్
  11. ధనియపొడి స్పున్
  12. జీలకర్ర పొడి స్పున్
  13. కొత్తిమీర గుప్పెడు
  14. నూనె డీప్ ప్రై కు సరిపడా
  15. లవంగాలు 10

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి కొద్దిగా నూనె,ఉప్పు కొద్దిగా,తగినన్ని నీళ్లుపోసి చెప్పాతి పిండిలా కలుపుకోవాలి. పక్కనపెట్టుకోవాలి.
  2. కూరగాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  3. తరువాత ఒక బాండీలో స్పున్ నూనె వేసి వేగిన తరువాత ...ఉల్లిపాయలు, వేసి వేగనివ్వాలి .తరువాత పచ్చిమిర్చి,బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి .తరువాత క్యాప్సికం ముక్కలువేసి 5 నిముషాలు మగ్గినటారువత కారం,ఉప్పు,పసుపు,స్పైసీస్ అన్నీ వేసి కలపాలి .చివరగా కొత్తిమీర వేసి కలపాలి .రెడీ ఐన స్టఫింగ్ఒక ప్లేట్ లో తీసుకోవాలి.
  4. ఇప్పుడు నానిన పిండిని సమాన భాగాలుగా నిమ్మకాయ సైజ్ ముద్దలు చేసి పెట్టుకోవాలి.
  5. ఒక ముద్ద తీసుకొని పూరీల ఒత్తుకోవాలి. తరువాత దానిమీద స్టఫింగ్ పెట్టుకోవాలి.
  6. తరువాత ఇంకొక చిన్న ముక్కతో పైన కవర్ చేసుకోవాలి .రెండు వైపులా కట్ చేసుకోవాలి ఇలా ...
  7. తరువాత ఒకదాని తరువాత ఒక ముక్క క్రాస్ గా వేసుకోవాలి.కింద చుపినట్లు
  8. ఇలా అన్ని వేసుకొని ఫిష్ ఆకారం తెచ్చి చివరగా తడి చేసి అతికించాలి. తోక దగ్గర ఫోర్క్ తో ఒత్తుకొని గాట్లు పెట్టుకోవాలి.హెచ్చులు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి.ఒక లవంగం తీసుకొని కన్ను భాగంలో గుచుకోవాలి.
  9. తరువాత పోయిమీద బాండిపెట్టి నూనె వేసి డీప్ ప్రై చేసుకోవాలి.
  10. రెండువైపులా నిదానంగా తిప్పుతూ బంగారు రంగు వచ్చిన తరువాత తీసేయాలి.అప్పుడు అందమైన ఫిష్ ఆకారంలో క్యాప్సికం సమోసా రెడీ.
  11. తరువాత కొత్తిమీరతో అలంకరించి టమాటా సాస్ తో వేడి వేడి గా అందివ్వాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర