చెకోడీలు | Chekodi Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  15th Dec 2018  |  
4 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Chekodi by Kavitha Perumareddy at BetterButter
చెకోడీలుby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

31

1

చెకోడీలు వంటకం

చెకోడీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chekodi Recipe in Telugu )

 • బియ్యంపిండి ఒక కప్ సుమారు పావుకిలో
 • ఉప్పు తగినంత
 • నెయ్యి 2 స్పూన్స్
 • వాము 2 స్పూన్స్
 • పసుపు కొద్దిగా
 • నీళ్లు కప్పున్నర
 • నూనె డీప్ ప్రై కు సరిపడా

చెకోడీలు | How to make Chekodi Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నెతీసుకొని పోయిమీద పెట్టి నీళ్లు పోసి కాగినతరువత తగినంత ఉప్పు,వాము,పసుపు,నెయ్యి వేసి మరిగిన తరువాత మంట తగ్గించి పిండివేసి కలుపుకోవాలి. గట్టిపడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని వేరే గిన్నెలో తీసుకోవాలి.
 2. పిండిని చేతితో బాగా ఒత్తుతూ మర్దనచేయాలి. అప్పుడు స్మూత్ గా అవుతుంది.
 3. తరువాత కొద్దికొద్దిగా పిండి తీసుకొని అరచేతిలో వేసుకొని స్టిక్ లా రోల్ చేసి చివర అతికించుకోవాలి .ఒక రింగ్ లాగా .ఇలా అన్ని చేసుకోవాలి.
 4. తరువాత పోయిమీద బాండిపెట్టి నూనెవేసి కాగనిచ్చి చెకోడీలు వేసి డీప్ ప్రై చేసుకోవాలి.
 5. అంతే కర కర లాడే చెకోడీలు రెడీ.

నా చిట్కా:

ఇవి వేయించేటప్పుడు మరీ ఎర్రగా ఉండవు. వేయించేటప్పుడు బుడగలు రావడం ఆగిపోతే వేగిపోయినట్లే తీసేయాలి అప్పుడు.

Reviews for Chekodi Recipe in Telugu (1)

Shobha.. Vrudhulla9 months ago

AdHurs
జవాబు వ్రాయండి