హోమ్ / వంటకాలు / శంకర్ పాళీ(కమ్మటివి)

Photo of Salted shankar paali by Swapna Tirumamidi at BetterButter
490
3
0.0(0)
0

శంకర్ పాళీ(కమ్మటివి)

Dec-15-2018
Swapna Tirumamidi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శంకర్ పాళీ(కమ్మటివి) రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు...పండగలు,పబ్బాలకి... టైంపాస్ చిరుతిళ్ళు కు ఇది చాలా మంచి వంటకం.మహారాష్ట్ర వాళ్ళు దీపావళికి దీన్ని తీపి గా,మరియు తీపిలేకుండా చేసుకుంటారు.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • మహారాష్ట్ర
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 8

  1. మైదా ...కొలతలేదు.
  2. పాలు, 1 కప్
  3. బట్టర్ 1 కప్
  4. సాల్ట్ కొద్దిగా..
  5. వాము లేదా జీలకర్ర దంచినది ఒక స్పూన్.
  6. వేయించడానికి చాలినంత నూని.

సూచనలు

  1. పాలు వేడిచేసి బట్టర్ వేసి కరిగించాలి.
  2. పాలు బట్టర్ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని..వాము,ఉప్పు వేసి ఆ మిశ్రమానికి పట్టినంత మైదా వేసి బాగా కలపాలి..నీటితో కలపకూడదు.10 నిమిషాలు పక్కన ఉంచాలి.
  3. పూరి పిండి మాదిరిగా ఉండాలి.
  4. ఈ లోగా వేయించడానికి సరిపడా నూని పొయ్యిమీద పెట్టి వేడిచెయ్యాలి.
  5. ఆయిల్ వేడి అయ్యేలోపు...మైదా ముద్దని బాగా మెదపి పొడి పిండి సాయంతో మందంగా పూరిలా వత్తుకోవాలి.
  6. దాన్ని నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేయించుకోవాలి....గలగళలాడేవారకు వేయించాలి...మందంగా వుతాయి కాబట్టి చిన్నమంట మీద బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.
  7. అంతేనండీ చక్కటి కమ్మటి శంకర్ పాళీలు రెడీ... గుల్లగా కరకర లాడుతూ చాలబావుంటాయి.టీ తో పాటు ఆరగిస్తే చక్కగా ఉంటాయి.ఇలాగే స్వీటీగా తినాలనుకుంటే పాలు,బట్టర్,పంచదార సమాన కొలతలుగా తీసుకొని...వాము ఉప్పు లేకుండా చేయాలి...మిగతా ప్రాసెస్ అంతా ఇదే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర