టమాట జంతికలు | Tomato jantikalu Recipe in Telugu

ద్వారా Swapna Sashikanth Tirumamidi  |  15th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Tomato jantikalu by Swapna Sashikanth Tirumamidi at BetterButter
టమాట జంతికలుby Swapna Sashikanth Tirumamidi
 • తయారీకి సమయం

  40

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

టమాట జంతికలు వంటకం

టమాట జంతికలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tomato jantikalu Recipe in Telugu )

 • గోధుమపిండి 1 కప్
 • వరిపిండి 1 కప్
 • కారం 2 చెంచాలు
 • ఉప్పు తగినంత.
 • నూపప్పు 2 చెంచాలు
 • వాము 1 చెంచా
 • టమాటాలు 6 పెద్దవి

టమాట జంతికలు | How to make Tomato jantikalu Recipe in Telugu

 1. గోధుమపిండి, వరిపిండి రెండు కలిపి జల్లించి మెత్తటి శుభ్రమైన కాటన్ గుడ్డలో మూట కట్టి 20 నిమిషాలు పాటు ఆవిరి పట్టాలి.(రైస్ కుక్కర్ లో 3 గ్లాసుల నీళ్లుపోసి..నీటికి తగలకుండా పైన చిల్లులు గిన్నె పెట్టి ఆ గిన్నీలో ఈ పిండి మూట పెట్టి పైన మూత పెట్టి పవర్ ఆన్ చేసి ఆవిరి మీద ఉడికించాలి)
 2. ఇది రెడి అయ్యేలోపు టమాటాలు గాటుపెట్టి కొద్దిగా నీళ్లు పోసి బాగ వుడికించి తొక్క ఒలిచి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి.
 3. 20 నిమిషాలు అయ్యాక పిండి మూతని విప్పిచూస్తే పిండి అంతా గట్టిగా రాయిలా గడ్డలుగా అయివుంటుంది ..అపుడు కొద్దిగా చల్లారనిచ్చి చిదిపి మిక్సీలో వేసి పొడి చేసి జల్లిస్తే మళ్ళీ మామోలుగా అయిపోతుంది.
 4. ఇలా అవిరిపట్టి జల్లించిన పిండిలో కారం,ఉప్పు,నూపప్పు,వాము,వేసికలిపి...ఇప్పుడు టమాటా పేస్ట్ వేసి కలిపి ఇంకా అవసరం ఐతే నీళ్లు కొద్దిగా వేసి జంతికల పిండిలా కలుపుకోవాలి.
 5. ఇప్పుడు నూనె పెట్టి వేడి చేసి....పిండిని జంతికల గొట్టం లో పెట్టి వేడి నూనెలోకి జాగర్తగా జంతికలు తిప్పుకుంటూ కరకరలాడేలా వేయించుకోవాలి ...అంతే అండి సూపర్ టేస్ట్ గా వుండే టమాటా జంతికలు రెడీ.

నా చిట్కా:

జంతికలు బాగా వేగాయోలేదో తెలియాలంటే ...జంతికలు నూనెలో వెయ్యగానే బుడగలు వస్తాయికదా...అవి తగ్గేవరకు వెయిస్తే చాలు.

Reviews for Tomato jantikalu Recipe in Telugu (0)