హోమ్ / వంటకాలు / టమాట జంతికలు

Photo of Tomato jantikalu by Swapna Tirumamidi at BetterButter
811
3
0.0(0)
0

టమాట జంతికలు

Dec-15-2018
Swapna Tirumamidi
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాట జంతికలు రెసిపీ గురించి

ఇది మామూలుగా చేసుకునే జంతికలకు కొంచం భిన్నంగా ఉంటుంది.కొంచం శ్రమ అయినా దీని రుచి మన శ్రమని మర్చిపోయేలాచేస్తుంది..నెల పాటు నిలువ ఉంటాయి.శెనగపిండి వాడము కాబట్టి కడుపు ఉబ్బుతుంది అనే భయం లేకుండా ఆనందంగా తినచ్చు.తినిపించవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. గోధుమపిండి 1 కప్
  2. వరిపిండి 1 కప్
  3. కారం 2 చెంచాలు
  4. ఉప్పు తగినంత.
  5. నూపప్పు 2 చెంచాలు
  6. వాము 1 చెంచా
  7. టమాటాలు 6 పెద్దవి

సూచనలు

  1. గోధుమపిండి, వరిపిండి రెండు కలిపి జల్లించి మెత్తటి శుభ్రమైన కాటన్ గుడ్డలో మూట కట్టి 20 నిమిషాలు పాటు ఆవిరి పట్టాలి.(రైస్ కుక్కర్ లో 3 గ్లాసుల నీళ్లుపోసి..నీటికి తగలకుండా పైన చిల్లులు గిన్నె పెట్టి ఆ గిన్నీలో ఈ పిండి మూట పెట్టి పైన మూత పెట్టి పవర్ ఆన్ చేసి ఆవిరి మీద ఉడికించాలి)
  2. ఇది రెడి అయ్యేలోపు టమాటాలు గాటుపెట్టి కొద్దిగా నీళ్లు పోసి బాగ వుడికించి తొక్క ఒలిచి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి.
  3. 20 నిమిషాలు అయ్యాక పిండి మూతని విప్పిచూస్తే పిండి అంతా గట్టిగా రాయిలా గడ్డలుగా అయివుంటుంది ..అపుడు కొద్దిగా చల్లారనిచ్చి చిదిపి మిక్సీలో వేసి పొడి చేసి జల్లిస్తే మళ్ళీ మామోలుగా అయిపోతుంది.
  4. ఇలా అవిరిపట్టి జల్లించిన పిండిలో కారం,ఉప్పు,నూపప్పు,వాము,వేసికలిపి...ఇప్పుడు టమాటా పేస్ట్ వేసి కలిపి ఇంకా అవసరం ఐతే నీళ్లు కొద్దిగా వేసి జంతికల పిండిలా కలుపుకోవాలి.
  5. ఇప్పుడు నూనె పెట్టి వేడి చేసి....పిండిని జంతికల గొట్టం లో పెట్టి వేడి నూనెలోకి జాగర్తగా జంతికలు తిప్పుకుంటూ కరకరలాడేలా వేయించుకోవాలి ...అంతే అండి సూపర్ టేస్ట్ గా వుండే టమాటా జంతికలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర