హోమ్ / వంటకాలు / పంజాబీ మసాలా మట్రి

Photo of Punjabi masala matri by Swapna Tirumamidi at BetterButter
734
4
0.0(0)
0

పంజాబీ మసాలా మట్రి

Dec-15-2018
Swapna Tirumamidi
40 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పంజాబీ మసాలా మట్రి రెసిపీ గురించి

ఇదిచాలా బలవర్ధకం చాలా రుచి.టీ టైం లో తినవచ్చు.సరదాగా కబుర్లాడుకుంటూ కూడా తినడానికి బావుంటాయి...2..3..తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.పంజాబీ వారు చేసుకునే ఈ వంటకాన్ని మీకోసం అందిస్తున్నాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఉత్తర భారతీయ
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా 250గ్రామ్స్
  2. గోధుమపిండి 75 గ్రామ్స్
  3. శెనగపిండి 50 గ్రామ్స్
  4. సుజి రవ్వ50 గ్రామ్స్
  5. ఆయిల్ 100 గ్రామ్స్
  6. జీలకర్ర అర చెంచా
  7. వాము అర చెంచా
  8. ధనియాలు 1 చెంచా
  9. సొంపు 1 చెంచా
  10. మిరియాలు అర చెంచా
  11. లవంగాలు 5
  12. సాల్ట్ సరిపడా
  13. ఇంగువ పావు స్పూన్
  14. కసూరి మెంతి 2 చెంచాలు
  15. పసుపు పావు చెంచా

సూచనలు

  1. ముందుగా ధనియాలు,సోంపు, లవంగాలు,మిరియాలు మిక్సీలో బరకగా పొడి చెయ్యాలి.
  2. మైదా,శెనగపిండి,గోధుమ పిండి,రవ్వ,ఉప్పు,జీరా,వాము,ఇంగువ,పసుపు,కసూరిమేంతి,కొట్టిన మసాలా మిశ్రమం అన్ని కలిపి 100 గ్రాముల నూని వేసి కలిపి...కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ(సుమారు ముప్పావు కప్ నీళ్లు పడతాయి) గట్టిగా పూరి పిండిలా కలిపి 25 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి.
  3. ఇప్పుడు మూకుడు పెట్టి ఆయిల్ పోసి సన్న సెగమీద వేడి చెయ్యాలి.
  4. అది కాగేలోపు పిండిని మళ్ళీ ఒకసారి బాగా మెదిపి...చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి..పెద్ద గోళికాయలాంటి సైజ్ లో చెయ్యాలి.
  5. ఒకవుండని అరచేతిలో పెట్టుకుని ఇంకో అరచేతి అడుగు భాగం తో గట్టిగా నొక్కుతూ 2 అంగుళాల సైజ్లో కాస్త మందంగా బిళ్ళలు గా చేసుకోవాలి..అన్ని చేసి పెట్టుకోవాలి.
  6. ఇప్పుడు 10 బిళ్ళలు చప్పున నూనెలో వేసి నెమ్మదిగా వేయించాలి...ఒక వాయ వేగడనికి 10 నుంచి 12 నిమిషాలు పడుతుంది. ఇలా అన్ని బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసుకుని...గాలి దూరని డబ్బాలో దాచుకుంటే 2 నెలలు ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర