హోమ్ / వంటకాలు / చికెన్ రోస్ట్

Photo of Chicken roast by Annapurna jinkala at BetterButter
440
2
0.0(0)
1

చికెన్ రోస్ట్

Dec-17-2018
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ రోస్ట్ రెసిపీ గురించి

మా పిల్లలు రసం అన్నం వేసి చికెన్ ఫ్రై చేస్తే ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

  1. చికెన్ 1/2 కెజి
  2. పసుపు చిటికెడు
  3. అల్లంవెల్లుల్లి పేస్ట్ 2స్పూన్లు
  4. ఉప్పు తగినంత
  5. కారం 2స్పూన్లు
  6. ధనియాలపొడి 2స్పూన్లు
  7. ఉల్లిపాయలు 4
  8. టమాటాలు 4
  9. పచ్చిమిర్చి 4
  10. గరంమసాలా 1 స్పూన్
  11. కొత్తిమీర కరివేపాకు 3రెమ్మలు
  12. నూనె 5 స్పూన్లు

సూచనలు

  1. మిక్సీలో 3ఉల్లిపాయముక్కలు, 3టమాటా ముక్కలు, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కళ్ళుప్పు ఒక స్పూన్ వేసి పేస్ట్ చేసుకోవాలి
  2. స్టవ్ పైన పాన్ పెట్టి కడిగిన చికెన్ వేసి ఉప్పు ,పసుపు, కారం, కొద్దిగా ధనియాలపొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్ కలిపి సగం గ్లాస్ నీరు వేసి ఉడికించాలి
  3. పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని అవి వేగాక టొమాటో ముక్కలు వేసి వేయించి
  4. ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి కలిపి నూనె పైకి తేలే వరకు వేయించాలి
  5. ధనియాలపొడి, ఉప్పు ,కారం వేసి కలపాలి
  6. నీరు మొత్తం ఇంకిపోయి ఉడికిన చికెన్ వేసి సిమ్ లో 5నిలు డ్రై అయ్యేవరకూ వేయించాలి. మసాలా మొత్తం ముక్కలకి పట్టాకా 10 నిలు హై లో వేయించి మళ్ళీ సిమ్ లో గరం మసాలా, కొత్తిమీర వేసి వేయించాలి
  7. పొడిపొడిగా అయిన చికెన్ ప్లేటులోకి తీసుకొని సర్వ్ చెయ్యడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర