జీరా రైస్ | Jeera rice Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  17th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Jeera rice recipe in Telugu,జీరా రైస్, Sree Vaishnavi
జీరా రైస్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    40

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

జీరా రైస్ వంటకం

జీరా రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jeera rice Recipe in Telugu )

  • 2 కప్పుల బాస్మతి బియ్యం
  • 2 చెంచాలు నెయ్యి
  • 2-3 తరిగిన పచ్చిమిర్చి
  • 3 1/2 కప్ నీళ్లు
  • 3 చెంచాలు జీలకర్ర
  • బిరియాని ఆకు 1
  • 4 ఇలాచీ
  • 2 అంగుళాలు దాల్చినచెక్క
  • 6 లవంగాలు
  • 1 జావిత్రి
  • ఉప్పు తగినంత
  • కరివేపాకు 1 రెమ్మ

జీరా రైస్ | How to make Jeera rice Recipe in Telugu

  1. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి 20-30 నిమిషాలు నానబెట్టుకోవాలి
  2. తరువాత నీళ్లని వార్చేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి వేసి కరిగించుకోవాలి
  4. కరిగిన తరువాత అందులో బిరియాని ఆకూ ,లవంగాలు ,ఇలాచీ ,జావిత్రి ,దాల్చిన చెక్క వేసి బాగా వేయించాలి
  5. తరువాత జీలకర్ర ,కరివేపాకు వేసి బాగా మంచి వాసన వచ్చే వరకు వేయించాలి
  6. తరువాత పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలి
  7. వేగిన తరువాత అందులో బాస్మతి బియ్యం వేసి 3-4 నిమిషాలు వేయించాలి
  8. ఇప్పుడు అందులో 3 1/2 కప్పుల నీళ్లు పోసుకోవాలి
  9. అందులో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి
  10. దానిని హై ఫ్లేమ్ మీద ఉడికించాలి
  11. నీళ్లు అంత ఉడికే వరకు ఉంచాలి
  12. అంతే ఎంతో రుచికరమైన జీరా రైస్ రెడీ

Reviews for Jeera rice Recipe in Telugu (0)