హోమ్ / వంటకాలు / జీరా రైస్

Photo of Jeera rice by Sree Sadhu at BetterButter
910
4
0.0(0)
0

జీరా రైస్

Dec-17-2018
Sree Sadhu
40 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జీరా రైస్ రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కప్పుల బాస్మతి బియ్యం
  2. 2 చెంచాలు నెయ్యి
  3. 2-3 తరిగిన పచ్చిమిర్చి
  4. 3 1/2 కప్ నీళ్లు
  5. 3 చెంచాలు జీలకర్ర
  6. బిరియాని ఆకు 1
  7. 4 ఇలాచీ
  8. 2 అంగుళాలు దాల్చినచెక్క
  9. 6 లవంగాలు
  10. 1 జావిత్రి
  11. ఉప్పు తగినంత
  12. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి 20-30 నిమిషాలు నానబెట్టుకోవాలి
  2. తరువాత నీళ్లని వార్చేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి వేసి కరిగించుకోవాలి
  4. కరిగిన తరువాత అందులో బిరియాని ఆకూ ,లవంగాలు ,ఇలాచీ ,జావిత్రి ,దాల్చిన చెక్క వేసి బాగా వేయించాలి
  5. తరువాత జీలకర్ర ,కరివేపాకు వేసి బాగా మంచి వాసన వచ్చే వరకు వేయించాలి
  6. తరువాత పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించాలి
  7. వేగిన తరువాత అందులో బాస్మతి బియ్యం వేసి 3-4 నిమిషాలు వేయించాలి
  8. ఇప్పుడు అందులో 3 1/2 కప్పుల నీళ్లు పోసుకోవాలి
  9. అందులో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి
  10. దానిని హై ఫ్లేమ్ మీద ఉడికించాలి
  11. నీళ్లు అంత ఉడికే వరకు ఉంచాలి
  12. అంతే ఎంతో రుచికరమైన జీరా రైస్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర