ఫ్రూట్ జామ్ ఇడ్లీలు | Fruit jam idlis Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  17th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Fruit jam idlis by Pasumarthi Poojitha at BetterButter
ఫ్రూట్ జామ్ ఇడ్లీలుby Pasumarthi Poojitha
 • తయారీకి సమయం

  2

  1 /2గంటలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

ఫ్రూట్ జామ్ ఇడ్లీలు

ఫ్రూట్ జామ్ ఇడ్లీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fruit jam idlis Recipe in Telugu )

 • మినపగుళ్ళు 1 చిన్న గ్లాస్
 • ఇడ్లీ రవ్వ 2 గ్లాసులు
 • నీళ్ళు సరిపడా
 • కిసాన్ జామ్ 2 ప్యాకెట్స్
 • ఉప్పు రుచికి

ఫ్రూట్ జామ్ ఇడ్లీలు | How to make Fruit jam idlis Recipe in Telugu

 1. ముందుగా మినపగుళ్ళు ఒక గిన్నె లో వేసుకొని వాటర్ పోసి రెండు గంటలు నాన పెట్టాలి .
 2. అలాగే వేరే గిన్నె లో రవ్వ కూడా వేసుకొని నాన పెట్టాలి .
 3. రెండు శుభ్రముగా కడిగి పక్కన పెట్టుకోవాలి.మినపగుళ్ళు మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా అయ్యే వరకు నీళ్ళు పోయకుండా రుబ్బుకోవాలి ఎక్కువ పోయకూడదు.
 4. ఇప్పుడు ఆ పిండి ని ఒక గిన్నె లో కి తీసుకొని రవ్వ ని నీళ్ళు లేకుండా పిండి లో వేసుకోవాలి.ఉప్పు వేసుకొని కలుపుకోవాలి.
 5. ఇప్పుడు ఆ పిండి ని అరగంట నాననివ్వాలి .
 6. ఇడ్లీ రేకులకి నూనె రాసుకొని అందులో ఇడ్లీ పిండి వేసుకోవాలి ఆ ఇడ్లీ పైన కిసాన్ జామ్ ని రౌండ్ షేప్ వేసుకోవాలి.
 7. ఇడ్లీ ని 6,7 నిమిషాలు ఉడికించి తీసేయాలి అంతే .
 8. వేడి మీద ఉండగానే స్పూన్ తడి చేసుకొని మెల్లగా తీయాలి. వేడి వేడి గా తింటే చాలా బాగుంటాయి.

Reviews for Fruit jam idlis Recipe in Telugu (0)