హోమ్ / వంటకాలు / ఆకు కూరల బిర్యాని

Photo of Leafy vegetables biryani by Ram Ram at BetterButter
927
2
0.0(0)
0

ఆకు కూరల బిర్యాని

Dec-18-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకు కూరల బిర్యాని రెసిపీ గురించి

ఆకు కూరలు తినని వాళ్ళు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది.పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే ఆరోగ్యం కూడా.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. చుక్కకూర 2కట్టలు
  2. పుదీనా 1కట్ట
  3. కొత్తిమీర 1కట్ట చిన్నది
  4. పాలకూర 1కట్ట
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3స్పూన్లు
  6. పచ్చిమిర్చి 5-6
  7. కరివేపాకు 2రెబ్బలు
  8. ఉల్లిపాయ చిరికలు 1కప్పు
  9. దాల్చిన చెక్క చిన్నది
  10. లవంగాలు 5-6
  11. యాలకులు 2
  12. జీడిపప్పు 10
  13. ఉప్పు సరిపడ
  14. పసుపు 1/2స్పూన్
  15. నూనె 6-7స్పూన్లు
  16. నెయ్యి 3స్పూన్లు
  17. బియ్యం అర కేజి

సూచనలు

  1. ముందుగా ఆకుకూరలు అన్ని బాగా కడిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు మిక్సి లో పుదీనా, కొత్తిమీర,పాలకూర వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు కుక్కర్ స్టౌవ్ మీద పెట్టుకుని నూనె వేసి,వేడి అయ్యాక దాల్చిన చెక్క లవంగాలు, యాలుకులు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి.
  4. ఇప్పుడు ఉల్లిపాయ చీరికలు ,పచ్చిమిర్చి చీరికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి కరివేపాకు మరియు చుక్క కూర ఆకులు వేసుకోవాలి.అన్నీ బాగా వేయించుకోవాలి.
  5. ఇప్పుడు మనం ముందుగా మిక్సి పట్టిన ఆకుకూరల పేస్ట్ వేసి వేయించాలి.పచ్చి వాసన పోయేవరకు వేయించాలి నూనె వేరు అవ్వనివ్వలి
  6. ఇప్పుడు కడిగిన బియ్యం వేసి అంతా బాగా కలుపుకుని పసుపు, ఉప్పు వేసుకోవాలి.
  7. తర్వాత గ్లాస్ బియ్యం కి 2 1/2 గ్లాస్ నీళ్ళు కొలత వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 కూతలు వేయించుకోవాలి.
  8. అంతే ఆకు కూర బిర్యాని తయారు.
  9. మూత తీసిన తర్వాత నెయ్యి వేసి కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర