బంగాళదుంప చిప్స్ | Aloo chips Recipe in Telugu

ద్వారా Ram Ram  |  18th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Aloo chips by Ram Ram at BetterButter
బంగాళదుంప చిప్స్by Ram Ram
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

బంగాళదుంప చిప్స్ వంటకం

బంగాళదుంప చిప్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo chips Recipe in Telugu )

  • బంగాళాదుంపలు 3 పెద్దవి
  • ఉప్పు
  • నీళ్లు సరిపడా
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

బంగాళదుంప చిప్స్ | How to make Aloo chips Recipe in Telugu

  1. చిప్స్ చేసుకోవడానికి బంగాళాదుంపలు పెద్దగా సమానంగా ఉండేలా చూసుకోవాలి..అప్పుడే చక్రాలు సమానంగా ఉంటాయి..
  2. బంగాళాదుంపలని చెక్కు తీసుకుని బాగా కడిగి పల్చని చక్రాలుగా చేసుకోవాలి..
  3. ఇప్పుడు ఒక లోతుగా ఉన్న గిన్నెలో రెండు లీటర్ల నీళ్లు తీసుకుని మరిగించాలి..అన్ని ముక్కలు ఒకేసారి మునిగెల చూసుకోవాలి..
  4. ఇప్పుడు స్టవ్ ఆపి అరగంటసేపు అలానే వేడి నీళ్లలో ఉంచుకోవాలి.
  5. అరగంట తర్వాత నీళ్లు వంపేసి పల్చటి గుడ్డ మీద వేసుకోవాలి..నీళ్లు అన్ని పోయాక..
  6. నూనె స్టవ్ మీద పెట్టి వేడి అయ్యాక చిన్న సెగ మీదనే డీప్ ఫ్రై చేసుకోవాలి..
  7. ఒక గట్టిగా పట్టే మూత ఉన్న డబ్బాలో తీసుకోవాలి దాని మీద ఉప్పు చల్లుకోవాలి..
  8. ఇవి ఎక్కువ రోజులు నిలువ ఉండవు..

నా చిట్కా:

బంగాళాదుంపల చక్రాల్ని ఎండలో ఎండపెట్టి వేయించుకుంటే అవి నిలవ ఉంటాయి..

Reviews for Aloo chips Recipe in Telugu (0)