హరాభరా కబాబ్ | Hara bhara kabab Recipe in Telugu

ద్వారా Aparna Reddy  |  19th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Hara bhara kabab by Aparna Reddy at BetterButter
హరాభరా కబాబ్by Aparna Reddy
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

హరాభరా కబాబ్ వంటకం

హరాభరా కబాబ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Hara bhara kabab Recipe in Telugu )

 • 300 గ్రామ్స్ చిలకడ దుంపలు
 • 1/2 కప్ కొత్తిమీర
 • 1 కప్ పచ్చిబఠాణీలు
 • 1 నుండి 3 పచ్చిమిర్చి
 • 120 గ్రామ్స్ పాలకూర
 • 3 చెంచాల శెనగ పిండి
 • 1/4కప్ బ్రేడ్ పౌడర్(తప్పనిసరి కాదు)
 • 11/2 చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్
 • 1/2 చెంచా గరంమసాలా
 • 1/4 చెంచా ఆంచూర్ పొడి
 • ఉప్పు తగినంత

హరాభరా కబాబ్ | How to make Hara bhara kabab Recipe in Telugu

 1. చిలగడదుంపలు తీసుకొని శుభ్రముగా కడిగి ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు.
 2. పాన్ తీసుకొని శెనగ పిండిని వేయించుకోవాలి. .మంచి సువాసన వచ్చిన తరువాత తీసి పక్కన ఉంచుకోవాలి.
 3. అదే పాన్ లో రెండు చెంచాల నూనె వేసుకొని అల్లంవెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
 4. అదే పాన్ లో బఠాణీలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసి బఠాణీలు ఉడికించుకోవాలి. పాలకురకూడా వేసి మగ్గనివ్వాలి
 5. తరువాత రుచికి తగినంత ఉప్పు వేసి అన్నీ మసాలా పొడులు వేసుకొని కొత్తిమీర కూడ వేసుకొని మెత్తగా మిక్సీ లో పేస్ట్ చేసుకోవాలి.
 6. ఇప్పుడు ఒక పాత్ర లో ఉడికించిన చిలకడదుంపలు మెత్తగా మెదుపుకొని పైన మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని కలుపుకోవాలి.
 7. కబాబ్స్ కావలిసిన పిండి రెడిగా ఉంది ఇప్పుడు అవసరం అనుకొంటే కొంచెం బ్రెడ్ పౌడర్ వేసుకోవచ్చు.
 8. ఇప్పుడు మొత్తం పిండిని బాగా కలుపుకొని చెయ్యికి నూనె రాసుకొని బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి.
 9. పాన్ పెట్టుకొని ఒక చెంచా నూనె వేసి బాల్స్ ను కొంచెం వత్తుకొని రెండు వైపులా తిప్పు కుంటూ షాలో ఫ్రై చేసుకోవాలి.కావాలి అనుకొంటే ఓవెన్ లో కూడా చేసుకోవచ్చు.
 10. ఇప్పుడు హారబరా కబాబ్స్ ను మనకు నచ్చిన విధంగా అలంకరించుకొని సర్వ్ చేసుకోవచ్చును. కెచప్ లేదా టమోటో సాస్ తో డిప్ చేసుకొని తింటే రుచికరంగా ఉంటాయి.

నా చిట్కా:

పాలకూర ను ఎక్కువ ఉడికించవద్దు.కబాబ్ రంగు ఆకుపచ్చ గా రాదు మరియు పోషక విలువలు కూడా పోతాయి.

Reviews for Hara bhara kabab Recipe in Telugu (0)