హోమ్ / వంటకాలు / హరాభరా కబాబ్

Photo of Hara bhara kabab by Aparna Reddy at BetterButter
0
2
0(0)
0

హరాభరా కబాబ్

Dec-19-2018
Aparna Reddy
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హరాభరా కబాబ్ రెసిపీ గురించి

స్నాక్ గా తీసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. 300 గ్రామ్స్ చిలకడ దుంపలు
  2. 1/2 కప్ కొత్తిమీర
  3. 1 కప్ పచ్చిబఠాణీలు
  4. 1 నుండి 3 పచ్చిమిర్చి
  5. 120 గ్రామ్స్ పాలకూర
  6. 3 చెంచాల శెనగ పిండి
  7. 1/4కప్ బ్రేడ్ పౌడర్(తప్పనిసరి కాదు)
  8. 11/2 చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్
  9. 1/2 చెంచా గరంమసాలా
  10. 1/4 చెంచా ఆంచూర్ పొడి
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. చిలగడదుంపలు తీసుకొని శుభ్రముగా కడిగి ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోవద్దు.
  2. పాన్ తీసుకొని శెనగ పిండిని వేయించుకోవాలి. .మంచి సువాసన వచ్చిన తరువాత తీసి పక్కన ఉంచుకోవాలి.
  3. అదే పాన్ లో రెండు చెంచాల నూనె వేసుకొని అల్లంవెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
  4. అదే పాన్ లో బఠాణీలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసి బఠాణీలు ఉడికించుకోవాలి. పాలకురకూడా వేసి మగ్గనివ్వాలి
  5. తరువాత రుచికి తగినంత ఉప్పు వేసి అన్నీ మసాలా పొడులు వేసుకొని కొత్తిమీర కూడ వేసుకొని మెత్తగా మిక్సీ లో పేస్ట్ చేసుకోవాలి.
  6. ఇప్పుడు ఒక పాత్ర లో ఉడికించిన చిలకడదుంపలు మెత్తగా మెదుపుకొని పైన మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని కలుపుకోవాలి.
  7. కబాబ్స్ కావలిసిన పిండి రెడిగా ఉంది ఇప్పుడు అవసరం అనుకొంటే కొంచెం బ్రెడ్ పౌడర్ వేసుకోవచ్చు.
  8. ఇప్పుడు మొత్తం పిండిని బాగా కలుపుకొని చెయ్యికి నూనె రాసుకొని బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి.
  9. పాన్ పెట్టుకొని ఒక చెంచా నూనె వేసి బాల్స్ ను కొంచెం వత్తుకొని రెండు వైపులా తిప్పు కుంటూ షాలో ఫ్రై చేసుకోవాలి.కావాలి అనుకొంటే ఓవెన్ లో కూడా చేసుకోవచ్చు.
  10. ఇప్పుడు హారబరా కబాబ్స్ ను మనకు నచ్చిన విధంగా అలంకరించుకొని సర్వ్ చేసుకోవచ్చును. కెచప్ లేదా టమోటో సాస్ తో డిప్ చేసుకొని తింటే రుచికరంగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర