సామ బియ్యపు ఇడ్లి | Little Millet idli Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  20th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Little Millet idli by Anitha Rani at BetterButter
సామ బియ్యపు ఇడ్లిby Anitha Rani
  • తయారీకి సమయం

    5

    గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

3

0

సామ బియ్యపు ఇడ్లి వంటకం

సామ బియ్యపు ఇడ్లి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Little Millet idli Recipe in Telugu )

  • సామ బియ్యము 250గ్రా
  • మినపప్పు 100గ్రా
  • అటుకులు 4 టేబుల్ స్పూన్స్
  • ఉప్పు సరిపడా
  • షోడా పొడి చిటికెడు

సామ బియ్యపు ఇడ్లి | How to make Little Millet idli Recipe in Telugu

  1. సామ బియ్యము,మినపప్పు మెంతులు కడిగి 5 గంటలు నానబెట్టుకోవాలి.
  2. రుబ్బుకోనే 1గంట ముందు అటుకులు నాన బెట్టు కోవాలి.
  3. అన్ని కలిపి మెత్తగా మిక్సీ కి లేదా రోటిలో సరిపడా నీరు వేసుకొని రుబ్బు కోవాలి.
  4. రుబ్బుకున్న పిండిని 4 గంటలు తరువాత వాడుకోవాలి.
  5. ఇడ్లి పెట్టుకునేటప్పుడు ఉప్పు,వంట షోడా పొడి వేసి బాగా కలపాలి.పిండి గట్టిగా ఉండాలి.
  6. ఇడ్లి స్టాండ్ కు నెయ్యి పూసుకుని దానిలో గరిటీ తో పిండి వేసి ,ఇడ్లి పాత్ర లో పెట్టుకోవాలి.
  7. 15ని తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  8. చల్లారిన తరువాత మూత తీసి చెంచా తో ఇడ్లిలు తీసుకుని వడ్డించుకోవాలి.
  9. ఇడ్లి సాంబార్ తో కానీ,కొబ్బరి పచ్చడితో కలిపి తింటే రుచి గా ఉంటుంది.

నా చిట్కా:

ఇడ్లి చేసే టప్పుడు ఉప్పు,వంట షోడా కలుపుకుంటే మెత్తగా వస్తాయి.

Reviews for Little Millet idli Recipe in Telugu (0)