హోమ్ / వంటకాలు / తందూరీ మోమోస్

Photo of Tandoori momos by ప్రశాంతి మారం at BetterButter
622
4
0.0(0)
0

తందూరీ మోమోస్

Dec-21-2018
ప్రశాంతి మారం
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తందూరీ మోమోస్ రెసిపీ గురించి

పిల్లలకు ఎంతో నచ్చే స్నాక్ ఐటమ్ ఇది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా - 1 కప్పు
  2. క్యాబేజీ తురుము - 1 కప్పు
  3. ఉల్లిపాయ - 1
  4. పచ్చిమిర్చి 4
  5. పెరుగు - అర కప్పు ( గట్టిది)
  6. కారం - 1 స్పూన్
  7. ఉప్పు - 1 స్పూన్
  8. మిరియాల పొడి - అర స్పూన్
  9. గరం మసాలా -అర స్పూన్
  10. అల్లం వెల్లుల్లి ముద్ద - అర స్పూన్
  11. చాట్ మసాలా - అర స్పూన్
  12. డ్రై మాంగో పొడి - పావు స్పూన్
  13. నిమ్మకాయ - అర చెక్క
  14. కొత్తిమీర - పావు కప్పు
  15. సోయా సాస్ - అర స్పూన్
  16. ఆవ నూనె - 3 స్పూన్స్
  17. నూనె - డీప్ ఫ్రై కి తగినంత.

సూచనలు

  1. ముందు ఒక గిన్నెలో మైదా ,కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోసి చపాతీ పిండి ల కలిపి 15 నిమిషాలు నాననివ్వాలి.
  2. ఒక గిన్నెలో క్యాబేజీ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు,మిర్చీ ముక్కలు, మిరియాల పొడి, సోయా సాస్ వేసి కలిపి స్టఫింగ్ రెడీ చేసుకోవాలి.
  3. పిండి చిన్న చిన్న గా వత్తుకొని మధ్యలో క్యాబేజీ మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసేసి మోమోస్ లా చేసుకోవాలి
  4. ఇప్పుడు వీటిని కాగిన నూనె లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
  5. ఇప్పుడు మరో గిన్నెలో పెరుగు, ఉప్పు,కారం,అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాలా,చాట్ మసాలా,డ్రై మాంగోపొడి,నిమ్మరసం,కొత్తిమీర,మిరియాలపొడి కలిపి ఆవ నూనె చివరగా వేసి కలిపి మ్యారినెట్ చేసి పెట్టుకోవాలి.
  6. వేయించిన మోమోస్ ను పెరుగు మిశ్రమంలో వేసి మసాలా పట్టే లాగా కోట్ చేసుకోవాలి.
  7. ఇప్పుడు పాన్ పెట్టి అందులో రెడి చేసుకున్న మోమోస్ ని ఉంచాలి
  8. 2 నిమిషాలు బాగా వేడి మీద ఫ్రై చేస్తే మసాలా ఫ్లేవర్ బాగా పట్టి తందూరీ మోమోస్ తయారవుతాయి.
  9. వీటిని ప్లేట్ లోకి తీసి కొత్తిమీర తో గార్నిష్ చేసి టొమాటో సాస్ తో సర్వ్ చేస్తే చాలా టేస్టీ గా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర