హోమ్ / వంటకాలు / రవ్వ పులిహోర

Photo of Rawa pulihora by sneha gilla at BetterButter
0
4
0(0)
0

రవ్వ పులిహోర

Dec-21-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ పులిహోర రెసిపీ గురించి

సాధారణంగా బియ్యపురవ్వతో ఉప్పిడి పిండి చేసుకుంటారు.కానీ నేను ఇక్కడ అలా కాకుండా పులిహార చేశాను.ఇలా చేయటం వల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యపు రవ్వ 1 కప్పు
  2. నీళ్ళు 1/2 కప్పు
  3. నూనె 3 స్పూన్లు
  4. ఆవాలు 1/2 స్పూన్
  5. జీలకర్ర 1/2 స్పూన్
  6. పసుపు 1/2 స్పూన్
  7. పల్లీలు 1 స్పూన్
  8. శనిగపప్పు 1 స్పూన్
  9. కరివేపాకు,కొత్తిమీర కొద్దిగా
  10. పచ్చిమిర్చి
  11. నిమ్మకాయ
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా కడాయి పెట్టుకొని 1 1/2 కప్పు నీళ్ళు పోసి అందులో కొద్దిగా నూనె,పసుపు వేసి మరిగించుకోవాలి.
  2. అలా మరుగుతున్న నీళ్లలో రవ్వను వేసి 10 ని చిన్న మంటపై ఉడికించుకోవాలి.
  3. ఉడికిన రవ్వను ఒక గిన్నెలో చల్లారపెట్టుకోవాలి.
  4. తర్వాత ఒక కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాకఆవాలు,జిలకర ,పల్లీలు,శనిగపప్పు,కరివేపాకు,పచ్చిమిర్చి ,ఉప్పు,పసుపు వేసి చివరిగా నిమ్మరసం,కొత్తిమీర వేయాలి.
  5. ఈ పోపు ని చల్లారబెట్టులున్న రవ్వ లో వేసి కలిపి సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర