హోమ్ / వంటకాలు / రాజ్మా కూర కొబ్బరి పాలతో

Photo of Rajma curry with coconut milk by Ram Ram at BetterButter
674
1
0.0(0)
0

రాజ్మా కూర కొబ్బరి పాలతో

Dec-23-2018
Ram Ram
480 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాజ్మా కూర కొబ్బరి పాలతో రెసిపీ గురించి

రాజ్మాలు ఆరోగ్యానికి మేలు కాబట్టి చిన్నపిల్లలకు పెడితే ఇలా చేసి ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రాజ్మాలు 1 కప్పు
  2. కొబ్బరి పాలు 1 కప్పు
  3. ఉల్లిపాయలు 2
  4. టొమాటోలు 2
  5. అల్లం వెల్లులి పేస్ట్ 1 స్పూన్
  6. ఆవాలు 1స్పూన్
  7. కరివేపాకు కొద్దిగా
  8. ఎండి మిర్చి 2
  9. గరం మసాలా 2 స్పూన్లు
  10. దానియా పొడి 1 స్పూన్
  11. పసుపు 1/4స్పూను
  12. కారం 2 స్పూన్లు
  13. ఉప్పు రుచికి సరిపడా
  14. నీళ్లు కొద్దిగా
  15. నూనె 4 స్పూన్లు

సూచనలు

  1. రాజ్మాలని 8 గంటలపాటు నీళ్లలో నానపెట్టుకోవాలి
  2. ఇప్పుడు కొబ్బరి పాలు తీసుకోవాలి కొబ్బరి తురుముని మిక్సీలో కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పడితే పేస్ట్ అవుతుంది
  3. ఆ పేస్ట్ ని ఒక పల్చటి గుడ్డలో వేసి పిండితే పాలు వస్తాయి అవి ఒక కప్పు తీసుకోవాలి
  4. ఇప్పుడు రాజ్మాలు కుక్కర్లో పెట్టి నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు కరివేపాకు ఎండు మిర్చి వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి
  6. ఉల్లిపాయలు రంగు మారేటపుడు అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి
  7. ఇప్పుడు కారం గరం మసాలా దానియా పొడి పసుపు ఉప్పు వేసి 3 నిమిషాలు కలిపి చిన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి
  8. ఇప్పుడు రాజ్మాలు ఉడికించిన నీళ్లతో పాటు వేసి కొబ్బరి పాలు కూడా వేసుకోవాలి
  9. కూర దగ్గర పడే వరకు ఉడికించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర