హోమ్ / వంటకాలు / వెజ్ పల్లి పొడి దోస రోల్

Photo of Veg peanut powder dosa roll by Sree Sadhu at BetterButter
566
6
0.0(0)
0

వెజ్ పల్లి పొడి దోస రోల్

Dec-24-2018
Sree Sadhu
720 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ పల్లి పొడి దోస రోల్ రెసిపీ గురించి

పిల్లలికి చాలా మంచిది మరియు చాలా కమ్మగా ఉంటుంది కూరగాయలు తినని పిల్లలికి ఇలా ట్రై చేయండి కొంచమైనా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. మినపప్పు 1/2 కప్
  2. 1 1/2 కప్ బియ్యం
  3. 1/4 చెంచా మెంతులు
  4. 2 చెంచాలు అటుకులు
  5. ఉప్పు తగినంత
  6. నీళ్లు తగినంత
  7. పల్లీలు 1/2 కప్
  8. ఎండుమిర్చి 5-6
  9. జీలకర్ర 1/2 చెంచా
  10. సన్నగా తరిగిన కాప్సికం 1/8 కప్
  11. సన్నగా తరిగిన టమాటో 1/8 కప్
  12. సన్నగా తరిగిన ఉల్లిపాయ 1/8 కప్
  13. తురిమిన క్యారెట్ 2 చెంచాలు
  14. నెయ్యి 1 చెంచా
  15. ఛీజ్ తురిమినది 2 చెంచాలు
  16. మిశ్రమ మూలికల పొడి 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా మినపప్పు, బియ్యం ,మెంతులు, అటుకులు అన్ని నీటిలో 5 గంటలు నానబెట్టుకోవాలి
  2. తరువాత దానిని మెత్తగా మిక్సీ లో పేస్ట్ చేసుకోవాలి
  3. దానిని ఒక రాత్రి ఉరనివ్వాలి
  4. ఊరిన దానిలో కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి
  6. అందులోనే జీలకర్ర ,ఎండుమిర్చి వేసి వేయించాలి
  7. దాని అంతటిని ఒక మిక్సీ లోకి తీసుకుని చల్లారిన తరువాత పొడి చేసుకుని పెట్టుకోవాలి
  8. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి
  9. దాని మీద దోస పిండి వేసి పలచగా వేసుకోవాలి
  10. దాని మీద పల్లి పొడి వేసుకోవాలి
  11. దాని మీద తరిగిన ఉల్లిపాయ, టమాటో ,కాప్సికం, క్యారెట్ వేసుకోవాలి
  12. చివరిగా ఛీజ్ ని పైన తురుముకోవాలి
  13. అది వేగిన తరువాత మధ్యలోకి కట్ చేసి రోల్ చేసుకుని పైన ఛీజ్ తురుముకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర