హోమ్ / వంటకాలు / బోయిల్డ్ చికెన్ కర్రీ

Photo of Boiled chicken curry by Ram Ram at BetterButter
612
2
0.0(0)
0

బోయిల్డ్ చికెన్ కర్రీ

Dec-26-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బోయిల్డ్ చికెన్ కర్రీ రెసిపీ గురించి

చికెన్ ఉడికించడం వలన పిల్లలు తినడానికి మెత్తగా ఉండి ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • తేలికైనవి
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. చికెన్ 1/4కేజీ
  2. ఉల్లిపాయలు 1/2కప్పు
  3. టమాటో ముక్కలు 1/4కప్పు
  4. మిరియాలు 5
  5. దాల్చిన చెక్క చిన్నది
  6. లవంగాలు 4
  7. జీలకర్ర 1/4స్పూన్
  8. యాలుక 1
  9. కరివేపాకు కొద్దిగా
  10. కారం 2 స్పూన్లు
  11. పసుపు 1/2 స్పూన్
  12. ఉప్పు సరిపడా
  13. గరం మసాలా 1స్పూన్
  14. కొత్తిమీర కొద్దిగా
  15. నూనె 6స్పూన్లు

సూచనలు

  1. ముందుగా చికెన్ ని బాగా కడిగి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు కుక్కర్ లో చికెన్ మరియు చికెన్ మునిగె వరకు నీళ్లు వేసి మూత పెట్టి 5-6కూతలు వేయించుకోవాలి
  3. అవి ఉడికిన తర్వాత వేరే గిన్నెలో తీసుకుని అదే కుక్కర్ లో నూనె వేసి మసాలా దినుసులు జీలకర్ర వేసి వేయించాలి
  4. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ చీరికలు పచ్చి మిర్చి ముక్కలు వేసుకోవాలి
  5. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించి పసుపు కారం గరం మసాలా ఉప్పు వేసి 2 నిమిషాలు కలిపి టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి
  6. ఇప్పుడు ఉడికించిన చికెన్ వేసి బాగా కలిపి ఉడికించిన నీళ్లు వేసి కొద్దిగా కరివేపాకు వేసి నీళ్లు సరిపోకపోతే ఇంకొద్ది నీళ్లు వేసి మళ్ళీ మూత పెట్టి 4 కూతలు వేయించుకోవాలి
  7. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర