హోమ్ / వంటకాలు / అంగూర్ రబడి

Photo of Angoor Rabdi by Aparna Reddy at BetterButter
536
2
0.0(0)
0

అంగూర్ రబడి

Dec-27-2018
Aparna Reddy
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అంగూర్ రబడి రెసిపీ గురించి

పిల్లలు కు చాలా బలాన్ని ఇస్తుంది.పాలు ఇష్టపడని పిల్లలు ఇలా చేసిన బాగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పశ్చిమ బెంగాల్
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 250 గ్రాములు పన్నీర్
  2. 250 గ్రాములు పంచదార
  3. 1 లీటరు పాలు
  4. 2 చెంచాల మైదా
  5. 100 గ్రాములు బాదం
  6. 100 గ్రాములు పిస్తా
  7. 1/2 చెంచా యాలకులపొడి
  8. కొద్దిగా కుంకుమపువ్వు
  9. 2 కప్పుల నీళ్లు

సూచనలు

  1. ముందుగా పన్నీరు తీసుకొని చేతితో మెత్తగా అయ్యేలా చేసుకోవాలి.
  2. అందులో కొంచెం మైదా వేసుకొని బాగా కలుపుకోవాలి.
  3. చిన్న చిన్న ఉండలుగా చేసుకొవాలి.
  4. ఉండలను చేతి తో వత్తు కోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పంచదార, నీళ్ళు పోసి మరగనివ్వాలి.తీగ పాకం వచ్చేంత వరకు ఉంచి,యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొవలెను.
  6. పంచదార పాకం లో పన్నీరు ఉండలు వేసి పక్కన పెట్టుకోవాలి.
  7. మరోవైపు స్టవ్ మీద పాన్ పెట్టి పాలు పోసి సన్నని మంటమీద 1/4 అయ్యే వరకు మరిగించాలి.పాలు చిక్కగా అయ్యాక బాదం,పిస్తా. కుంకుమపువ్వు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవలెను.రబడి రెడి అయింది.
  8. రబడి ని బాగా చల్లగా చేసుకొని అందులో పంచదార లో వేసిని పన్నీర్ బాల్స్ ను చేతితో బాగా వత్తుకొని వేసుకోవసలెను.
  9. సర్వ్ చేసుకొనే ముందు ఒక గంట సేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.అంతే చల్ల చల్లని అంగూర్ రబడి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర