హోమ్ / వంటకాలు / చీజీ భాజీ పరాఠా

Photo of Cheesy bhaji paratha by Sree Sadhu at BetterButter
698
4
0.0(0)
0

చీజీ భాజీ పరాఠా

Dec-27-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చీజీ భాజీ పరాఠా రెసిపీ గురించి

పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చాలా రుచిగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. కొత్తిమీర 1/2 కప్
  2. ఉల్లిపరక 1/4 కప్
  3. క్యారెట్ 1/4 కప్
  4. బీన్స్ 1/4 కప్
  5. కాలీఫ్లవర్ 1/2 కప్
  6. సెనగలు 1/8 కప్
  7. ఉల్లిపాయ 1
  8. టమాటో 2
  9. పచ్చిమిర్చి 2
  10. బట్టర్ 3 చెంచాలు
  11. ఛీజ్ తురుము 1/4 కప్
  12. ఎర్ర్ కాప్సికం 1/2 కప్
  13. పావ్ భాజీ మసాలా 2 చెంచాలు
  14. ఉప్పు తగినంత
  15. కారం తగినంత
  16. పాలకూర పేస్ట్ 3 చెంచాలు
  17. గరం మసాలా 1 చెంచా
  18. నీళ్లు తగినంత
  19. క్వినోవా పిండి 1 కప్
  20. హోల్ వీట్ గోధుమ పిండి 1 కప్
  21. సోడా 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో కినోవా పిండి ,గోధుమ పిండి ,ఉప్పు, సోడా, బట్టర్ వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో తగినన్ని నీళ్లు పోసి మెత్తటి పిండి కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు అందులో ఉప్పు వేసుకోవాలి
  4. అందులో కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్ ,సెనగలు వేసి బాగా ఉడికించాలి
  5. ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని అందులో బట్టర్ వేసి కరగనివ్వాలి
  6. కరిగిన దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి
  7. అందులో కాప్సికం కూడా వేసి వేయించాలి
  8. వేగిన ఉడికిన ఉడికిన కూరగాయ ముక్కలు వేసి బాగా స్మాష్ చేసుకోవాలి
  9. అందులో టొమాటోలు ముక్కలు వేసి బాగా ఉడకనివ్వాలి
  10. అందులో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి
  11. అందులో కొత్తిమీర ,పాలక్ పేస్ట్ వేసి బాగా ఉడకనివ్వాలి
  12. అందులో చివరిగా ఛీజ్ తురుము వేసి మరి కొద్దిగా బట్టర్ వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి
  13. ఇప్పుడు పిండి తీసుకుని కొద్దిగా పిండి వేసుకుని వత్తుకోవాలి
  14. దాని మధ్యలో కూర పరుచుకోవాలి
  15. దాని మీద బట్టర్ తురిమి మరో ఒక రోటి వేసి ఎడ్జెస్ మూసేసుకోవాలి నీళ్ళ సహాయం తో
  16. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి బట్టర్ వేసుకుని కరగనివ్వాలి
  17. దాని మీద తయారు చేసుకున్న రోటి వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి
  18. దాని కత్తి సహాయం తో నాలుగు ముక్కలుగా కట్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర