హోమ్ / వంటకాలు / చీజ్ వెజ్జి మెకరోని/పాస్తా.

Photo of Cheese veggi macaroni/pazzta by Swapna Tirumamidi at BetterButter
420
9
0.0(0)
0

చీజ్ వెజ్జి మెకరోని/పాస్తా.

Dec-27-2018
Swapna Tirumamidi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చీజ్ వెజ్జి మెకరోని/పాస్తా. రెసిపీ గురించి

ఇది ఇటాలియన్ వంటకం.పెద్దల మాట ఎలవున్నా పిల్లలకు ఇది మహా ప్రీతి.ఈ వంటకాన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు.ఇది చాలా దేశాలవారికి ముఖ్య ఆహారం కూడా.అంటే మనం అన్నం ఎలా తింటామో అలా కొందరు పాస్తాని ముఖ్య ఆహారంగా భుజిస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఇటాలియన్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. స్టెప్ 1 ...మెకరోని/పాస్తా(ఏ రకం అయినా )200 గ్రాములు
  2. నూని అర చెంచా
  3. ఉప్పు ఒక చిన్న చెంచాడు
  4. స్టెప్ 2...ఆలివ్ నూని లేదా ఆముల్ వెన్న 2 చెంచాలు
  5. ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
  6. కేరేట్ ముక్కలు అర కప్పు
  7. బ్రకొలి ముక్కలు అర కప్పు
  8. మష్రూమ్ ముక్కలు అర కప్పు
  9. మిరియాల పొడి పావు చెంచాడు
  10. ఉప్పు 2 చిటికెళ్ళు
  11. వెల్లుల్లి తరుగు 1 చెంచా
  12. స్టెప్ 3....సాస్ కోసం..బటర్ 4 చెంచాలు.
  13. మైదా 4 చెంచాలు
  14. పాలు 2 కప్పులు
  15. ఉప్పు 2 చిటికెలు
  16. మిరియాల పొడి 2 చిటికెళ్లు
  17. డ్రై హెర్బ్స్ 2 చిటికెలు
  18. ఎండుమిర్చి మోరుమ్(ఫ్లేక్స్) 1 చిటికెడు
  19. ఆముల్ చీజ్ కోరు 4 చెంచాలు.

సూచనలు

  1. ముందు ఒక పెద్ద గిన్నీలోకి 4 కప్పుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి,అందులో ఒక చెంచా ఉప్పు,అర చెంచా నూని వేసి మరిగించి మెకరోని వేసి 80 శాతం మాత్రమే ఉడకనివ్వాలి.
  2. ఇలా ఉడికిన మెకరోని ని చిల్లుల గిన్నిలోకి వేసి చల్లని నీళ్లతో ఒకసారి కడిగి నీరు వాడ నియ్యాలి...ఈ దశలో 2 చుక్కలు ఆలివ్ నూని వేసి కలిపి ఉంచాలి.*నూనె ఎక్కువ వేస్తే సాస్ మెకరోనికి పట్టదు .
  3. ఇప్పుడు కూర ముక్కల సంగతి చూద్దాం....ఒక మూకుడు లో 2 చెంచాల నూని లేదా బటర్ వేసి, సన్నని వెల్లుల్లి తరుగు వేసి,వేగాక ఉల్లి ముక్కలు వేసి వేయించాలి.
  4. ఇప్పుడు మిగతా కూర ముక్కలు అన్ని ఒక్కొక్కటిగా వేసి 2 నిమిషాలు వేయించి ఉప్పు మిరియం పొడి వేసి కలిపి దించి పక్కన పెట్టకోవాలి.కూర ముక్కలు ఎక్కువగా ఉడక కుండా ఉంటేనే పాస్తాలోకి బావుంటాయి.
  5. ఇప్పుడు సాస్ కోసం ఒక మూకుడు పెట్టి అందులో 4 చెంచాలు బటర్ వేసి కరగ నిచ్చి....4 చెంచాల మైదా వేసిబాగా కలిపి, పచ్చివాసన పోయేదాక వేయించి, ఇప్పుడు పాలను కొద్ది కొద్దిగా పోస్తూ వుండలులేకుండా బాగా కలిపి చిక్కగా సూపు లా అయ్యాక చిటికెడు ఉప్పు,ఎండుమిర్చి ఫ్లేక్స్ వేసి కలపాలి.
  6. సాస్ సరిగ్గా తయారైంది అని తెలుసుకోడానికి.....సాస్ లో ఏదైనా ఒక గరిట ముంచి చూస్తే గరిట అడుగు భాగానికి మరీచిక్కగా,మరీ పలుచగా కాకుండా సాస్ అంటుకొని ఉండాలి...ఇలా ఉంటే సాస్ తయారు అన్నమాట....
  7. ఇప్పుడు ఈ సాస్ లో ముందుగా మగ్గించి పెట్టుకున్న కూర ముక్కలు,ఉడికించిన మెకరోని వేసి అన్నీ బాగా కలిసేలా కలిపి....తురిమిన చీజ్ ని వేసి మళ్ళీ కలిపి ....ఒక 2 ...3 నిమిషాలు చిన్న మంట మీద ఉడకనివ్వాలి.
  8. చివరిగా డ్రై హెర్బ్స్ పొడి,మిరియాల పొడి చల్లి వేడి వేడిగా వడ్డిస్తే పిల్లలకి పండగే పండగ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర