పెసర పప్పు పాయసం | Moong dal kheer Recipe in Telugu

ద్వారా SwathiBindhu Peeta  |  28th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Moong dal kheer by SwathiBindhu Peeta at BetterButter
పెసర పప్పు పాయసంby SwathiBindhu Peeta
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పెసర పప్పు పాయసం వంటకం

పెసర పప్పు పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moong dal kheer Recipe in Telugu )

  • పెసర పప్పు 1 కప్పు
  • బెల్లం 1/2 కప్పు
  • పాలు 1 కప్పు
  • జీడి పప్పు 1 గుప్పెడు
  • యాలకులు 3
  • నెయ్యి 2 టీ స్పూన్

పెసర పప్పు పాయసం | How to make Moong dal kheer Recipe in Telugu

  1. ముందుగా పెసరపప్పుని వుడికించి చల్లార్చాలి .
  2. ఉడికించిన పెసర పప్పు ని మెదిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమానికి దంచిన బెల్లం వేసుకుని కలపాలి.
  3. ఇప్పుడు పైన మిశ్రమానికి కొంచం నీళ్ళు పోసి వుడికించాలి. బెల్లం కరిగే వరకు ఉడికించి, యాలకుల పొడి వేసుకుని కలపాలి.
  4. ఇప్పుడు పైన మిశ్రమం పొయ్యి మీద నుండి దించి పాలను కలుపుకోవాలి . ఒక బాని లో నెయ్యి వేసుకుని, జీడి పప్పులు వేయించి, పైన వున్న మిశ్రమం లో కలపాలి. సర్వింగ్ బౌల్ తీసుకుని వడ్డించడమే .

నా చిట్కా:

పాలను మిశ్రమాన్ని దిచాక కలపాలి. అప్పుడు పాలు విరిగి పోకుండా వుంటాయి.

Reviews for Moong dal kheer Recipe in Telugu (0)