కుండ కుల్ఫీ/మలై కూల్ఫీ | Pot kulfi Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  28th Dec 2018  |  
4.5 నుండి 2సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Pot kulfi by Anitha Rani at BetterButter
కుండ కుల్ఫీ/మలై కూల్ఫీby Anitha Rani
 • తయారీకి సమయం

  70

  నిమిషాలు
 • వండటానికి సమయం

  59

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

25

2

కుండ కుల్ఫీ/మలై కూల్ఫీ వంటకం

కుండ కుల్ఫీ/మలై కూల్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pot kulfi Recipe in Telugu )

 • పాలు 1 లీ
 • చక్కర 100 గ్రా
 • పిస్తా 25గ్రా
 • బాదం25 గ్రా
 • యాలకుల పొడి 1 చెంచా
 • కాజు 25 గ్రా
 • కుంకుమ పువ్వు అవసరమైతే

కుండ కుల్ఫీ/మలై కూల్ఫీ | How to make Pot kulfi Recipe in Telugu

 1. స్టీవ్ పైన మందపాటి బాండీ పెట్టి వేడి అయ్యాక పాలు పోయాలి.
 2. పాలు బాగా మరగానీయండి.1కి 3వంతు వచ్చేవరకు ,చిక్కగా అయ్యేంత వరకు మరగానీయండి.
 3. అందులో చక్కెర వేసి కలిపి చిక్కబడాలి.
 4. చిక్కటి మిశ్రమము లో బాదము,పిస్తా,కాజు తురుము,యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
 5. చల్లగా చల్లారనివ్వాలి.
 6. చల్లారిన మిశ్రమము ను కడిగిన కుండలో పోయాలి.
 7. కుల్ఫీ అచ్చులలో కూడా వేసుకోవచ్చు.
 8. అచ్చులో మిశ్రమాన్ని పోసి అందులో ఐస్ పుల్లలను పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి.
 9. గంట తరువాత చూస్తే పై విధముగా తయారవుతాయి.
 10. ఫ్రిజ్ లో నుండి తీసిన వంటనే కొద్దీ సేపు చల్ల నీటిలో ఉంచి తీస్తే పుల్ల తో పాటు కుల్ఫీ వస్తుంది.
 11. కుండలో పైన పిస్తా,బాదం,కాజు తురుము వేసుకొని పిల్లలకు ఇస్తే ఇష్టముగా తింటారు.
 12. చల్లని కుల్ఫీ వేసవి కాలం లో నే కాదు ఎప్పుడైనా తినొచ్చు.

నా చిట్కా:

పూర్తి కొవ్వు పాలను వాడితే కుల్ఫీ రుచిగా ఉంటుంది.

Reviews for Pot kulfi Recipe in Telugu (2)

Vamsidhar Reddy10 months ago

జవాబు వ్రాయండి

Shobha.. Vrudhulla10 months ago

Super akka
జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo