హోమ్ / వంటకాలు / గుడ్డు పప్స్

Photo of Egg Puffs by Gadige Maheswari  at BetterButter
572
3
0.0(0)
0

గుడ్డు పప్స్

Dec-28-2018
Gadige Maheswari
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుడ్డు పప్స్ రెసిపీ గురించి

ఇంటిలోనె సులభంగా పప్స్ చేయడం

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ప్రెజర్ కుక్
  • బేకింగ్
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి - 1 కప్
  2. గుడ్లు - 2
  3. చెక్కెర - 1/2 స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. నెయ్యి - 1/2 కప్
  6. ఉల్లిపాయలు - 2
  7. పచ్చిమిర్చి - 1
  8. ధనియాలపొడి - 1/2 స్పూన్
  9. పసుపు చిటికెడు

సూచనలు

  1. గోధుమ పిండి లో చెక్కెర ఉప్పు వేసి నీరు పోసి మెత్తగా ముద్దలా చేయాలి.
  2. ఇలా కలుపుకున్న పిండిపై నెయ్యి వేసి తడి బట్టతో కప్పి ఉంచాలి.
  3. కోడి గుడ్డు ను ఉడికించాలి.
  4. ఒక పాత్రలో కొంచెం నెయ్యి పోసి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి.
  5. ఆ తర్వాత ధనియాలపొడి ఉప్పు వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేయాలి.
  6. ఇప్పుడు పిండిని తీసుకుని చపాతీలా మందంగా వత్తుకోవాలి.
  7. దీని పైన నెయ్యి వేసి కొంచెం పిండి వేసి మడత పెట్టుకోని తడి బట్టతో కప్పి ఉంచాలి.
  8. ఇలా అరగంట కు ఒకసారి 3 లేదా 4 సార్లుచేసుకోవాలి.
  9. చివరికి ఒకసారి పిండిని చపాతీ లాగా వోత్తుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  10. దీని పైన ఉల్లిపాయ మిశ్రమాన్ని గుడ్డు పెట్టుకోని పైన అంచులు నీరు తో తుడుపు కొని ముసివేయాలి.
  11. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్ లోనికి తీసుకొని పైన గుడ్డు మిశ్రమంతో కోటింగ్ వేసి ఉంచాలి
  12. కుక్కర్లో ఉప్పు వేసి బాగా వేడి చేయాలి.
  13. ఆ తర్వాత మనం తయారు చేసిన పప్స్ ను ఉంచి చిన్న మంట మీద 30 నిమిషాలు ఉంచి మూత పెట్టాలి.
  14. అంతే నండి గుడ్డు పప్స్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర