హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్ కజ్జికాయలు

Photo of Dry fruit kajjikayalu by Sree Sadhu at BetterButter
496
5
0.0(0)
0

డ్రై ఫ్రూట్ కజ్జికాయలు

Dec-29-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూట్ కజ్జికాయలు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు డ్రై ఫ్రూట్ తినని పిల్లలికి ఇలా చేసి పెట్టచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. 500 గ్రాములు మైదా పిండి
  2. 4-5 చెంచాలు నెయ్యి
  3. నీళ్లు తగినంత
  4. ఉప్పు తగినంత
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  6. సూజి 120 గ్రాములు
  7. తురిమిన కొబ్బరి 60 గ్రాములు
  8. బెల్లం పొడి 100 గ్రాములు
  9. కాజు పొడి 20 గ్రాములు
  10. ఆల్మండ్ 20 గ్రాములు
  11. పిస్తా 20 గ్రాములు
  12. వేయించిన పల్లీలు పొట్టు తీసినవి 1/4 కప్
  13. నువ్వులు 1 చెంచా
  14. ఇలాచీ పొడి 1/2 చెంచా
  15. కిస్మిస్ 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా, రవ్వ ,నెయ్యి ,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు దానిని 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు ఒక కప్ లో సూజి ,బెల్లం పొడి, కొబ్బరి పొడి అన్ని సమానం గా తీసుకోవాలి
  5. ఇప్పుడు అందులో రెండు చెంచాలు కరిగిన నెయ్యి వేసుకోవాలి
  6. ఇప్పుడు అందులో సూజి వేసి వేయించాలి 2-3 నిమిషాలు
  7. దానిని తీసేసి అందులో కాజు, పిస్తా ,బాదాం వేసి డ్రై ఫ్రై చేయాలి
  8. అందులో నీవ్వులు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  9. ఇప్పుడు డ్రై ఫ్రూట్ ని ,నువ్వులిని పొడి చేసుకోవాలి
  10. ఇప్పుడు ఒక గిన్నెలో వేయించిన సూజి ,కొబ్బరి ,బెల్లం, నట్స్ పొడి, ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకోవాలి
  11. ఇప్పుడు కజ్జికాయలికి పిండి తీసుకుని పల్చగా వత్తుకోవాలి
  12. ఇప్పుడు కజ్జికాయలు మౌల్డ్ లో నెయ్యి రాసుకోవాలి
  13. ఇప్పుడు వత్తుకున్న దానిని మౌల్డ్ మీద పెట్టుకోవాలి
  14. ఇప్పుడు చెంచా సహాయం తో తయారు చేసుకున్న మిశ్రమం వేసుకోవాలి
  15. ఇప్పుడు మౌల్డ్ మూసేసి ఎక్కువ ఉన్నది తీసేయాలి
  16. ఆలా కావలిసినవి అన్ని చేసుకోవాలి
  17. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకోవాలి
  18. అందులో కజ్జికాయలు వేసి ఎర్రగా వేయించి తీసేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర