హోమ్ / వంటకాలు / ఇన్స్టంట్ మసాలా దోస

Photo of Instant Masala Dosa by Kathi Mamatha at BetterButter
577
3
0.0(0)
0

ఇన్స్టంట్ మసాలా దోస

Dec-29-2018
Kathi Mamatha
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టంట్ మసాలా దోస రెసిపీ గురించి

తయారు విధానం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1 1/2కప్
  2. బియ్యపు పిండి 1cup
  3. బొంబాయి రవ్వ 2tbsp
  4. బంగాళాదుంపలు 1/2kg
  5. ఉల్లిపాయలు 1 పెద్దది
  6. జీలకర్ర 1tsp
  7. కరివేపాకు 1 రెమ్మ
  8. మిరపకాయలు 5
  9. కొత్తిమీర 2tbsp సన్నగా తరిగినది
  10. ఉప్పు తగినంత
  11. నిమ్మకాయ చిన్న ముక్క

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంపలు కడిగి ఉడకబెట్టుకోవాలి... ఉడికిన తరువాత వాటిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి
  2. ఒక గిన్నె తీసుకొని అందులో మైదా, బియ్యపు పిండి, రవ్వ , కొంచెం ఉప్పు అన్ని వేసుకొని నీళ్లతో కలుపుకోవాలి.... దోస పిండిలా జారుడుగా కలుపుకోవాలి... దాన్ని బంగాళాదుంప కూర చేసేవరకు పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక పాన్ స్టవ్ పైన పెట్టుకొని వెలిగించుకోవాలి... పాన్ వేడి అయ్యాక నూనె వేసుకోవాలి... నూనె వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన కరివేపాకు, జీలకర్ర వేసి ఒక నిమిషము ఫ్రై చేసుకోవాలి..
  4. అందలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి...
  5. ఇప్పుడు మిరపకాయ ముక్కలు,ఉప్పు, ఆలుగడ్డ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి....
  6. కూర మిశ్రమాన్ని కాస్త గంటెతో ప్రెస్ చేసుకోవాలి... అలా చెస్తే కూర కాస్త మెత్తగా కొంచెం ముక్కలుగా బాగుంటుంది దోసలో పెట్టుకోడానికి
  7. చివరగా కొత్తిమీర, నిమ్మ రసం వేసుకోని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి
  8. ఇప్పుడు దోస పాన్ స్టవ్ పైన పెట్టుకోవాలి వెలింగించు కోవాలి
  9. పాన్ వేడి అయ్యాక ముందుగా తయారు చేసిన పిండిని తీసుకొని ఒక గుంట స్పూనుతో దోస వేసుకోవాలి..
  10. దోస పైన కొంచెం నూనె వేసుకోవాలి... దోస అయ్యాక దోస పైనుంచి కొంచెం ఆళ్ళగడ్డ కూరని పెట్టుకొని దోస ని మడుచుకోవాలి.... అంతే దోస రెడీ అయ్యాక ఒక ప్లేట్ లో తీసుకోని పల్లి చట్నీ తో తింటే చాలా బాగుంటుంది....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర