హోమ్ / వంటకాలు / పప్పు చారు

Photo of Pappu charu by Ram Ram at BetterButter
1621
5
0.0(0)
0

పప్పు చారు

Dec-30-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పప్పు చారు రెసిపీ గురించి

పప్పుచారు రుచిగా ఉంటుంది పిల్లలకు పప్పు ఆరోగ్యం రోజుకి ఒకసారి పప్పు దినుసులు తినిపిస్తుండలి ఇలా చేస్తే ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. కందిపప్పు ఒక కప్పు
  2. మునకాయ 1
  3. సొరకాయ చిన్న ముక్క
  4. టమాటో 1 పెద్దది
  5. ఉల్లిపాయ 1 పెద్దది
  6. చింతపండు కాడ 1
  7. బెల్లం చిన్న ముక్క
  8. అల్లం చిన్న ముక్క
  9. పచ్చి మిర్చి 4
  10. ఎండు మిర్చి 3
  11. కారం 2 స్పూన్లు
  12. ఉప్పు సరిపడా
  13. పసుపు 1/2స్పూన్
  14. ఆవాలు 1స్పూన్
  15. జీలకర్ర 1/2స్పూన్
  16. వెల్లులి రెబ్బలు 5
  17. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా కంది పప్పుని బాగా కడిగి కుక్కర్లో వేసి పచ్చిమిర్చి సరిపడ నీళ్లు వేసి మూత పెట్టి 5-6కూతలు వేయించాలి
  2. కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి సొరకాయ ముక్కలు మునకాయ ముక్కలు ఉల్లిపాయ చిరికలు టమాటో ముక్కలు చింతపండు రసం వేసి స్టవ్ వెలిగించి మరిగించాలి
  3. ఇప్పుడు పసుపు ఉప్పు అల్లం ముక్క చితకొట్టినది, బెల్లం 1స్పూన్ వేసి ఇంకొద్దిసేపు ముక్కలు ఉడికే వరకు మరగనివ్వాలి
  4. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 3స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లులి రెబ్బలు ఎండు మిర్చు వేసి వేయించి 2స్పూన్ల కారం వేసి వెంటనే పప్పుచ్చారు వేసి మూత పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర