Photo of Gobi 65 by sneha gilla at BetterButter
562
3
0.0(0)
0

గోబి 65

Dec-31-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబి 65 రెసిపీ గురించి

ఇది క్యాలిఫ్లవర్ మైదా,కార్న్ ఫ్లోర్,పెరుగు తో చేస్తాము.క్యాలీఫ్లవర్ తినని పిల్లలకి ఇది చేసిపెట్టండి.తప్పకుండ తింటారు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 2

  1. సగం ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు 2 కప్స్
  2. మైదా 1/2 కప్
  3. కార్న్ ఫ్లోర్ 3/4 కప్
  4. కారం 1/2 స్పూన్
  5. ఉప్పు 1/2 స్పూన్
  6. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  7. పోపు కోసం
  8. ఆయిల్ 2 స్పూన్స్
  9. ఆవాలు 1/2 స్పూన్
  10. జీరా 1/2 స్పూన్
  11. వెల్లుల్లి రెబ్బలు 8
  12. పచ్చిమిర్చి 1
  13. కారం 1/2 స్పూన్
  14. ఉప్పు 1/2 స్పూన్
  15. పెరుగు 1/2 కప్
  16. టమాటో సాస్ 2 స్పూన్స్
  17. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో కారం,ఉప్పు,మైదా,కార్న్ ఫ్లోర్,తగినన్ని నీళ్లుపోసుకొని బజ్జి పిండిలా కలుపుకొని అందులో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి.
  2. తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి వేడయ్యాక క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు,జీలకర్ర వేసి వేగాక పచ్చిమిర్చి,వెల్లుల్లి,ఉప్పు,కారం,పెరుగు,సాస్ వేసి వేగనివ్వాలి.
  4. అది వేగాక అందులో క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి కలిపి చివరిగా కొత్తిమీర వేయాలి.
  5. వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర